Drinking Water Tips, Do not drink water while taking food: ఈ భూ ప్రపంచంలోని ప్రతి జీవికి అత్యంత అవసరమైన పదార్థం 'నీరు'. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ 4-5 లీటర్ల నీరు త్రాగడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇదే నీరు మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసి.. వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. నిజానికి నీటిని సరైన పద్దతిలో తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదు. సక్రమంగా తాగకపోవడం వల్లనే మనం అనారోగ్యానికి గురవుతాం. త్రాగే నీటికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు ఓసారి తెలుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరిగా జీర్ణం కాదు:
చాలా మంది ఆహారం తీసుకునేటప్పుడు.. నీరు తాగుతూనే ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. మనం తింటున్నప్పుడు మన జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటుంది. దాంతో తీసుకున్న ఆహారాన్ని ఏకకాలంలో జీర్ణం చేస్తుంది. ఆహారంతో పాటు నీరు తీసుకుంటే.. అప్పుడు జీర్ణవ్యవస్థలో ఆటంకం ఏర్పడుతుంది. పొట్టలోని ఆహారం సరిగా జీర్ణం కాదు.


గుండెల్లో మంట:
ఆహారంతో పాటు నీటి ఎక్కువగా తీసుకుంటే.. గ్యాస్-ఎసిడిటీ, పుల్లని బెవులు వస్తాయి. అంతేకాదు యాసిడ్ రిలాక్సేషన్‌కు దారితీస్తుంది.  దీని కారణంగా గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల పొట్టలో కొవ్వు క్రమక్రమంగా పెరుగుతుంది. 


15-30 నిమిషాల తర్వాత:
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయాలంటే.. ఏదైనా తిన్న 15-30 నిమిషాల తర్వాత నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు. అప్పటిలోగా ఆహారం చాలా వరకు జీర్ణమవుతుంది. 15-30 నిమిషాల తర్వాత కూడా చల్లటి నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా జీర్ణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదు.   


గోరు వెచ్చని నీరు: 
ఆహారం గొంతులో చిక్కుకుపోతుందనే భయం లేదా కారం అవుతదని నీటిని పక్కనే ఉంచుకుంటాం. అయితే చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీళ్లను పెట్టుకోవడం మంచిది. అత్యవసర సమయంలో ఆ నీటిని ఉపయోగించవచ్చు. అలా చేస్తే జీర్ణక్రియ ప్రక్రియకు ఎలాంటి హాని ఉండదు. 


Also Read: PM Modi Mother Health: క్షీణించిన ప్రధాని మోదీ తల్లి ఆరోగ్యం.. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిక!  


Also Read: Dhoni Daughter Ziva: ఎంఎస్ ధోనీ కుమార్తెకు మెస్సి అదిరిపోయే గిఫ్ట్.. విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్న ఫాన్స్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.