COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 Best Drinks For Reduce Bad Cholesterol: శరీరంలో విపరీతమైన కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రాణాంతక వ్యాధులైన గుండెపోటు, మధుమేహం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే శరీరంలో కొలెస్ట్రాల్‌ అధికంగా పెరిగిపోయి..ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం కొలెస్ట్రాల్ సమస్యలో బాధపడేవారు ప్రతి రోజు ఈ రెండు డ్రింక్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రింక్స్‌ ఏంటో ఎప్పుడెప్పుడు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


గ్రీన్ టీ, బ్లాక్ టీ:
శరీరంలో కొలెస్ట్రాల్‌ కరిగించుకోవడానికి చాలా మంది కష్టపడి వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ముఖ్యంగా ఇలా వ్యాయామాలు చేసే క్రమంలోనే అనారోగ్యకరమైన ఆహారాలు కూడా అతిగా తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు జీవన శైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైల్‌లో భాగంగా ప్రతి రోజు గ్రీన్‌ టీ లేదా బ్లాక్‌ టీని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్లాక్‌ టీలో ఉండే కెఫెన్‌ కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ కరిగి బరువు కూడా తగ్గే ఛాన్స్‌లున్నాయని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి గ్రీన్ టీ కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును కూడా సులభంగా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజుకు మూడు కప్పుల చొప్పున గ్రీన్ టీని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 56 రోజుల పాటు గ్రీన్‌ని తాగితే శరీరంలో 14.4% శాతం చెడు కొలెస్ట్రాల్ కరుగుతుందని ఇటీవలే పరిశోధనల్లో తెలింది.


సోయా పాలు:
సోయా పాలలో సంతృప్త కొవ్వు తక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పాలను ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే చాలా మంది శరీర బరువు తగ్గడానికి పలు రకాల డైట్‌లను వినియోగిస్తున్నారు. అయితే ఈ డైట్ సోయా పాలను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి