Duck Egg Health Benefits: సాధారణంగా చాలా మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా బాతుగుడ్డును తిన్నారా? దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బాతుగుడ్డులో ప్రొటీన్, విటమిన్స్, బీ12, విటమిన్ డీ, ఐరన్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు బాతుగుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోడిగుడ్ల కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె, మెదడు ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాతు గుడ్డు కూడా సులభంగా జీర్ణం అవుతుంది. దీన్ని సరైన పద్ధతిలో వండుకుంటే రుచిగా కూడా అవుతుంది. కడుపు సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ఈరోజు వారానికి ఒకసారి బాతుగుడ్డు తింటే మన శరీరంలో ఏ మార్పు జరుగుతుందో తెలుసుకుందాం.


కండరాల అభివృద్ధి..
కోడిగుడ్ల కంటే బాతుగుడ్లలో ఎక్కువ శాతం ప్రొటీన్ ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు, కండరాల పెరుగుదలకు అవసరం. అంతేకాదు ఎక్సర్‌సైజ్‌ చేసే వారు బాతు గుడ్డును డైట్లో చేర్చుకోవాలి.


యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు..
యాంటీ ఆక్సిడెంట్‌లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు బాతు గుడ్డులో కెరోటనాయిడ్స్, అమైనో యాసిడ్స్ పుఫ్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. కంటి సంబంధిత సమస్యలు త్వరగా రాకుండా నివారిస్తుంది.


ఇదీ చదవండి: శరీరంలో రక్త సరఫరాను పెంచే 6 ఆహారాలు ఇవే..


మానసిక ఆరోగ్యం..
బాతు గుడ్డులో విటమిన్ డీ ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది. బాతు గుడ్డులో జింక్, మెగ్నిషియం, సెలీనియం ఉంటుంది. బాతు గుడ్డు తినడం వల్ల డిప్రెషన్, నీరసం సమస్యలు రాకుండా ఉంటాయి.


కేన్సర్..
బాతు గుడ్డులో యోక్ ఎరుపు రంగులో ఉంటుంది (లోపలి భాగం) ఇందులో కేన్సర్‌ కణాలు పెరగకుండా, అవి ఇతర భాగాలకు రవాణా కాకుండా నివారించే గుణం ఉంటుందట. అందుకే కేన్సర్‌ నివారించడానికి కేన్సర్ రాకుండా నివారిస్తుంది.


ఇదీ చదవండి: ప్రతిరోజూ 2 అంజీర్‌ పండ్లను తింటే ఏమవుతుందో తెలుసా?


ఎముక ఆరోగ్యం..
ఎముక ఆరోగ్యానికి తెల్లని భాగంలో కాల్షియం ఎముకలు గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. చికెన్‌ గుడ్డు కంటే బాతు గుడ్డులో ఇది అధికం. ఎక్కువ శాతం కాల్షియం ఉండే బాతు గుడ్డులో ఎముక ఆరోగ్యానికి మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter