Ladies Finger Benefits: ఆ ఒక్క కూరగాయ తింటే చాలు..మీ కంటి సమస్యలు దూరం
Ladies Finger Benefits: బిజీ లైఫ్‌స్టైల్, మొబైల్ ఫోన్స్ వినియోగం ఇలా కారణాలేమైనా కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. తక్కువ వయస్సుకే చత్వారం కళ్లద్దాలు ధరించే పరిస్థితి. కొన్ని రకాల కూరగాయలు నిత్యం తింటే.కంటి వెలుగు పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు..
Ladies Finger Benefits: బిజీ లైఫ్‌స్టైల్, మొబైల్ ఫోన్స్ వినియోగం ఇలా కారణాలేమైనా కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. తక్కువ వయస్సుకే చత్వారం కళ్లద్దాలు ధరించే పరిస్థితి. కొన్ని రకాల కూరగాయలు నిత్యం తింటే.కంటి వెలుగు పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు..
చిన్న పిల్లల్నించి..పెద్దోళ్లవరకూ అందరికీ కంటి సమస్య ప్రధానంగా ఉంటోంది. కళ్లు లేకపోతే ప్రపంచమే లేదనుకోవచ్చు. శరీరంలోని అన్ని భాగాల్లో కంటికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. జీవితం సాగేది, నడిచేది కంటితోనే. ఆ కంటికి వెలుగే లేకపోతే అంతా చీకటే. అందుకే కంటి సంరక్షణ చాలా అవసరం. కంటి సంరక్షణకు ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. మనం తినే అనారోగ్యకరమైన ఆహార పదార్ధాల వల్ల కూడా కంటి వెలుగు తగ్గుతుంది. ఒకే ఒక గ్రీన్ వెజిటెబుల్ కంటి సమస్యకు చెక్ పెడుతుందంటున్నారు ప్రముఖ నేత్ర వైద్యులు.
ఈ కూరగాయ అరుదైంది కానేకాదు. రోజూ లేదా ప్రతి ఇంట్లో నిత్యం వండుకునేదే. అదే బెండకాయ. బెండకాయలో భారీగా న్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బీటా కెరోటిన్ మూల పదార్ధాలైన జెక్సైన్థిన్, ల్యూటిన్ ఉంటాయి. దీంతోపాటు విటమిన్ ఏ కూడా ఉంటుంది. వీటి ద్వారా కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వృద్ధులు రోజూ బెండకాయ తింటే కేటరాక్ట్ కూడా తగ్గిపోతుంది.
బెండకాయల్ని ఎలా తిన్నా ఫరవాలేదు. బెండకాయ ఫ్రై లేదా బెండకాయ కూర లేదా పులుసు ఎలా తీసుకున్నా ప్రయోజనకరమే. అదే సమయంలో మరో పద్ధతిలో తీసుకుంటే ఇంకా అధిక మొత్తంలో లాభాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రతిరోజూ ఉదయం లేని పచ్చి బెండకాయలు తింటే కంటి వెలుగు మెరుగవుతుంది. అయితే ఇలా తినేముందు బెండకాయల్ని గోరువెచ్చని నీటిలో 1-2 సార్లు శుభ్రం చేయాలి. లేకపోతే జర్మ్స్ ముప్పు ఉంటుంది. ప్రతిరోజూ పరగడుపున 2-3 చిన్న చిన్న బెండకాయల్ని తినడం వల్ల కంటి వెలుగు పెరగడంతో పాటు బరువు తగ్గేందుకు కూడా ఉపయోగమౌతుంది. బెండకాయల్ని ఎండలో ఎండబెట్టి..పౌడర్ చేసుకోవాలి. రోజూ ఒక గ్లాసు పాలలో ఈ పౌడర్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. ఇక మరో విధానం బెండకాయల్ని స్లైసెస్‌గా కోసుకుని రాత్రి వేళ నీళ్లలో నానబెట్టాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తిని ఆ నీళ్లు కూడా తాగితే అద్భుతమైన ఫలితాలుంటాయి.
Also read: Cholesterol: కొలెస్ట్రాల్ ముప్పు దూరం కావాలంటే..గుర్తుంచుకోవల్సిన 6 విషయాలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook