Cholesterol: కొలెస్ట్రాల్ ముప్పు దూరం కావాలంటే..గుర్తుంచుకోవల్సిన 6 విషయాలు

Cholesterol: కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలో వివిధ సమస్యల్ని ఉత్పన్నం చేస్తుంది. హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి సీరియస్ రోగాల ముప్పు పొంచి ఉంటుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 17, 2022, 05:52 PM IST
Cholesterol: కొలెస్ట్రాల్ ముప్పు దూరం కావాలంటే..గుర్తుంచుకోవల్సిన 6 విషయాలు

Cholesterol: కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలో వివిధ సమస్యల్ని ఉత్పన్నం చేస్తుంది. హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి సీరియస్ రోగాల ముప్పు పొంచి ఉంటుంది. 

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు లేదా ఆరు నెలలకోసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టు తెలిస్తే వెంటనే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు ప్రమాదం అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవాలనే విషయంపై దృష్టి సారించాలి. దీనికోసం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొన్ని రకాల వస్తువులు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు డైట్ కంట్రోల్‌తో పాటు మెడికేషన్, ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. రోజూ తినే ఆహార పదార్ధాల్లో మార్పులు అవసరమౌతాయి.

మాంసంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ కొన్ని వస్తువుల్లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగవచ్చు. స్వీట్స్, యాడెడ్ షుగర్ వస్తువులు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గి..హాని చేసే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. యాడెడ్ షుగర్ కంటే...పండ్లు తినడం మంచిది. ఇక శాచ్యురేటెడ్ ఫ్యాట్ వస్తువుల్ని డైట్‌లో తగ్గించుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాల్ని తీసుకోవాలి. మీ శరీర బరువు తగ్గడం, పెరగడం జరుగుతుంటే..కార్డియోవాస్క్యులర్ వ్యాధి ముప్పు పొంచి ఉన్నట్టే.

మీ డైట్‌లో ఎప్పుడూ ఓట్స్, బార్లీ, యాపిల్, బీన్స్, ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్  చేర్చుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలతో కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. డైట్‌లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎప్పుడూ తీసుకోకూడదు. హెల్తీ ఫ్యాట్ మాత్రం తీసుకోవాలి. నట్స్ ఆవకాడో, సీడ్స్ డైట్‌లో ఉండాలి. ఇక కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. మీ డైట్‌లో బ్రోకోలి, కాలిఫ్లవర్ వంటి క్రూసిఫెరోస్ కూరగాయలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. 

Also read: Warts Removal Tips: సూరీడు కాయలు లేదా పులిపిర్లను ఇలా సులభంగా తొలగించుకోండి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News