Food To Get Periods Early: ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా  మహిళలు పీరియడ్స్‌ సమస్యలు ఎక్కువయ్యాయి. చాలా మందిలో పీరియడ్స్‌ రెగ్యులర్‌గా జరగకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల పీసీఓడీ సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య కొంత తగ్గతుంది. ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది అవి ఇవే...


పైనాపిల్‌: పైనాపిల్‌లో విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. విటమిన్‌ సి తీసుకోవడం వల్ల రక్తాన్ని పెంచుతుంది. నెలసరి సమయంలో రక్తస్రావం సక్రమంగా అవ్వడానికి ఏంతో సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్‌ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 



బొప్పాయి పండు: బొప్పాయి పండును పీరియడ్స్‌ సమయంలో తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ఈ పండులో అనేక పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల పీరియడ్స్‌ త్వరగా వస్తాయి.


Also read: Reduce Cholesterol: మీకు తెలుసా? సోరకాయ రసంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు..


డ్రై ఫ్రూట్స్‌: డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఐరన్‌ లెవల్స్‌ పెరగడంలో సహాయపడుతాయి. ఖర్జూరం, దానిమ్మ, బచ్చలికూర వంటి ఐరన్‌ రిచ్‌ ఆకుకూరలు తినడం వల్ల లేట్‌ అయిన పీరియడ్స్‌ త్వరగా వచ్చేలా చేస్తాయి.



విటమిన్‌ సి పదార్థాలు: పీరియడ్స్ తర్వగా రావాలి అంటే విటమిన్‌ సి కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కివీ, నిమ్మకాయ రసం  తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, పీరియడ్స్‌ సమయంలో అలసట, నీరసాన్ని తగ్గిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 
 


Also read: Weight Loss Benefits: బరువు తగ్గించుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter