Weight Loss Benefits: ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువు అంటే శరీర బరువెనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు దీని కారణంగా ఇతర వ్యాధుల బారిన కూడా పడుతున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 190 కోట్లకు పైగా అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవలే కొన్ని నివేదికలు వెల్లడించాయి. బరువు పెరగడం సాధారణమైనప్పటికీ చాలామందిలో ఈ చిన్న సమస్య కారణంగా దీర్ఘకాలిక వ్యాధులైన గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి.
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది చక్కెరతో కూడిన ఆహారాలు అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటూ ఉంటున్నారు. దీని కారణంగానే స్థూలకాయం బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది అధిక బరువు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయాలు ఏమిటంటే బరువు తగ్గడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడం వల్ల కలిగే లాభాలు:
మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది:
శరీరం ఎలా కనిపిస్తుందనేది ఆత్మవిశ్వాసం పై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. అధిక బరువు ఉన్నవారు తక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇది మన ఇమేజ్ కే సమస్యలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం వల్ల విశ్వాసం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
కీళ్ల నొప్పులు:
చాలామందిలో కీళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణం శరీర బరువేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం కారణంగా కీళ్లపై ఒత్తిడి పెరిగి కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కొంతమందిలో కీళ్లలో మంటలు కూడా వస్తున్నాయి. దీని కారణంగా కణజాలం దెబ్బతిని అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.
గుండె సమస్యలు తగ్గుతాయి:
బరువు పెరగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పెరుగుతూ ఉంటాయి దీని కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కావచ్చు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ గుండెలోని ధమనులోకి చేరి, పంపింగ్ ప్రక్రియను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా చాలామందిలో గుండెపోటు ఇతర గుండె సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి బరువు తగ్గడం వల్ల ఈ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter