Fat Burning Foods: ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను సహజంగా తగ్గించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  అధిక LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ బరువు పెరగడానికి దారితీస్తాయి. దీని కారణంగా గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక కొవ్వు, అధిక చక్కెర పదార్థాలు కలిగిన ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకరోగ్యకరమైన జీవనశైలి,  ఆహారం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆహారంలో ఈ  సూపర్ ఫుడ్‌లను చేర్చడంతో చెడు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. 


 ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు: 


ఓట్స్‌ ఆరోగ్యకరమైన జీవనశైలిలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇందులోని బీటా-గ్లూకాన్‌ అనే కరిగే ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం ఓట్స్‌తో తయారు చేసే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. డ్రై ఫూట్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయి. అందులోను ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్‌, పిస్తా వాటిని తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫైబర్‌, ఒమేగా-3, ప్రోటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తొగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 


వీటితో పాటు అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణవ్యస్థను మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ నుంచి రక్షిస్తుంది. గింజలు మాత్రమే కాకుండా కొన్ని రకాల పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో మొదటిది యాపిల్‌ ఇందులోని పెక్టిన్‌ అనే కరిగే ఫైబర్‌ పుషలంగా ఉంటుంది. ఇది ఫ్యాట్‌ ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. 


బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి.  ఇవి చెడు కొలెస్ట్రాల్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఈ సూపర్ ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చడంతో పాటు వ్యాయామం వంటి పనులు చేయడం చాలా అవసరం.


కొవ్వును కరిగించడానికి కొన్ని అదనపు చిట్కాలు:


పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌లతో కూడిన ఆహారాన్ని ఎంచుకోండి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో మేలు చేస్తుంది.  ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, అధిక కొవ్వు పదార్థాలను పరిమితం చేసుకోండి. ఈ ఆహారాలు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ భోజనం చేయడానికి ప్రయత్నించండి. నీరు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కేలరీలు లేకుండా కడుపు నిండిన భావన కలిగించడానికి సహాయపడుతుంది.



క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వారానికి చాలా రోజులు కనీసం 30 నిమిషాల మితమైన-తీవ్రత వ్యాయామం చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది మరింత కేలరీలు కాల్చడానికి సహాయపడుతుంది. బయటకు నడవడానికి, మెట్లు ఎక్కడానికి లేదా పనిలో లేదా ఇంట్లో ఎక్కువ కదలడానికి ప్రయత్నించండి.


జీవనశైలి:


మంచి నిద్ర పొందండి: ప్రతి రాత్రి 7-8 గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం.


ఒత్తిడిని నిర్వహించండి: ఒత్తిడి బరువు పెరగడానికి దారితీస్తుంది. యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి ఒత్తిడిని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనండి.


ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయండి: ఆల్కహాల్ కేలరీలు ఎక్కువగా ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి