Drinks Burns Fat in 7 Days: బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ శరీర బరువు తగ్గాలేకపోతున్నారు. బరువు తగ్గడం సులభమైనప్పటికీ, శరీర బరువును తగ్గించుకోవడం చాలా కష్టమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన పలు సూపర్‌ డ్రింక్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌ అవ్వడమేకాకుండా పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గించే డ్రింక్స్‌ ఇవే:


గ్రీన్ టీ:
హెల్తీ డ్రింక్స్‌లో గ్రీన్‌ టీ శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుందో అందరికీ తెలిసింది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు రెండు సార్లు ఈ టీని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు గ్రీన్‌టీలను తాగాల్సి ఉంటుంది. 


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్


యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ వెనిగర్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. యాపిల్‌ సైడర్‌లో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఎసిటిక్‌ యాసిడ్‌ కూడా అధికంగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌పై ప్రభావం చూపి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ఒక చెంచా యాపిల్ వెనిగర్‌ను.. గ్లాసు నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. ఇలా  ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.


బ్లాక్ కాఫీ:
బ్లాక్ కాఫీ ప్రతి రోజు తాగడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చక్కెర లేని బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు రెండు కప్పుత బ్లాక్‌ టీని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook