Fennel Seeds And Jaggery Benefits: సెప్టెంబర్ నెల ముగింపు, ఆక్టోబర్‌ నెల ప్రారంభంలో ఉన్నాం. దీంతో అందిరిలో అనారోగ్య సమస్యల రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలా మందిలో జలుబుతో పాటు దగ్గు వంటి సమస్యలు వస్తాయి. దీంతో పాటు డెంగ్యూ కేసులు కూడా విచ్చలవిడిగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సోంపు, బెల్లం మిశ్రమాన్ని ప్రతి రోజు వినియోగించడం వల్ల సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొట్టకు కూడా మేలు చేస్తుంది:
సోంపు, బెల్లం మిశ్రమం మార్కెట్‌లో, ఆయుర్వేద షాపుల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అయితే వీటిని పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరానికి ఐరన్‌ కూడా లభిస్తుంది. కాబట్టి దీనిని గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయి. 
   
ఈ మిశ్రమాన్ని ఎప్పుడు తినాలి: 
భోజనం చేసిన అరగంట తర్వాత సోంపు, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజు తీసుకుంటే ఆకలి కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ కూడా సులభంగా పెరుగుతాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల సీజన్‌ వ్యాధులు కూడా తగ్గుతాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


రక్తపోటును నియంత్రిస్తుంది: 
సోంపు, బెల్లం మిశ్రమం ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. దీంతో పాటు ఇన్ఫెక్షన్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా విటమిన్‌ లోపం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


నొప్పిల నుంచి ఉపశమనం:
సోంపు, బెల్లం మిశ్రమంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాల అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల తల నొప్పి, బాడీ ఫెయిన్స్‌ నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి