COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fenugreek Seeds For Control Diabetes: పోపు దినుసుల్లో మెంతి గింజలు ఒకటి..ఇవి ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. మెంతి గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా డయాబెటిస్‌ ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి. 


మెంతి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగించి తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు పాలిచ్చే మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి..శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
 
మెంతి టీ:

ఈ టీని తాయరు చేసుకోవడానికి ముందుగా మెంతులను బాగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా తయారు చేసుకున్న పొడిని రెండు గ్లాసుల నీటిలో కలుపుకుని బాగా ఉడికించుకుని, నిమ్మరసం కలుపుని తాగితే మంచి మంచి ఫలితాల పొందుతారు. అంతేకాకుండా సులభంగా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. 


మెంతి నీరు:
డయాబెటిక్ పేషెంట్ మెంతి నీరు ప్రతి రోజు తాగడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ఈ నీటిని తాగాలనుకునేవారు రాత్రిపూట నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..