Vitamin `D`: ఈ లక్షణాలను గమనించారా..? అయితే విటమిన్ `D` లోపమే కారణం!
శరీరంలో విటమిన్లు, మినరల్స్ లేదా ఏ పోషకం తగ్గినా.. శరీరం కొన్ని సంకేతాలను బహిర్గతం చేస్తుంది. వీటిని ముందుగానే గమనించి.. ప్రత్యామ్నాయాలను అనుసరిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. విటమిన్ `D` లోపం కలిగినపుడు బహిర్గతం అయ్యే లక్షణాలు..
Vitamin 'D' Deficiency: ప్రస్తుత కాలంలో అనుసరిస్తున్న ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి తక్కువ పోషకాలు లభిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ జంక్ ఫుడ్ వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. ఫలితంగా అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో సాధారణంగా విటమిన్ లోపం కూడా కలుగుతుంది. ముఖ్యంగా విటమిన్ 'D' లోపం వలన శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. శరీరంలో విటమిన్ 'D'లోపం వలన బహిర్గతం అయ్యే లక్షణాల గురించి తెలుసుకుందాం.
ఎముకల నొప్పి..
శరీరంలో విటమిన్ D లోపం ఏర్పడితే దాని ప్రభావం ఎక్కువగా శరీరంలోని ఎముకలపై పడుతుంది. దీని వలన ఎముకలు బలహీనంగా మారటం వలన ఎముకల్లో నొప్పి ఏర్పడుతుంది. విటమిన్ D లోపం వలన శరీరానికి కావాల్సిన కాల్షియం సరైన మోతాదులో అందదు. దీని వలన ఎముకలు బలహీనంగా మారటమే కాకుండా.. కొంచెం భారం పడిన ఎముకలు విరిగిపోతాయి.
జుట్టు రాలటం..
విటమిన్ D మన శరీరానికి చాలా అవసరమైన మూలకం. ఇది హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలకు సహాయపడుతుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపం కలిగితే మాత్రం.. వెంట్రుకల కుదుళ్లలో పెరుగుదల తగ్గి.. జుట్టు ఎక్కువగా రాలటం ప్రారంభం అవుతుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే.. విటమిన్ D అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
Also Read: Ap Heavy Rains: ఏపీలో రానున్న 48 గంటలు ఆ జిల్లాలకు అతి తీవ్ర వర్షాలు
అలసట..
శరీరంలో విటమిన్ 'D' లోపం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటిలో ముఖ్యంగా అలసట. రోజులో ఎనిమిది గంటలు పడుకున్నా కూడా అలసటగా భావిస్తుంటారు. ఆహారం తీసుకున్న, సరైన సమయం పడుకున్నా కూడా అలసట, నీరసం వంటివి కలుగుతుంటాయి.
ఆకలి లేకపోవటం..
సాధారణంగా శరీరంలో ఆకలి లేకపోవటం కూడా విటమిన్ 'D' లోపం వలన కలుగుతుంది. కాస్త తినగానే పొట్ట ఉబ్బినట్టు అనిపించటం.. ఎక్కువ సమయం ఆకలి లేకపోవటం వంటివి కూడా విటమిన్ 'D' లోపం వల్లనే కలుగుతాయి.
Also Read: WC 2023, India vs England: భారత్-ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ నేడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook