Fish egg benefits for Health : చేప‌లు (Fish) ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.  అలాగే చేప‌ల గుడ్లు (Fish eggs) కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. గుండె ఆరోగ్యానికి చేప‌ల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు (Health professionals) చెబుతున్నారు. కానీ వాస్త‌వానికి ఎక్కువ‌మంది మార్కెట్‌లో చేప‌లను ముక్క‌లుగా క‌ట్ చేయించే స‌మ‌యంలో చేప‌ల్లో గుడ్లు వ‌స్తే వాటిని ప‌డ‌వేయ‌మంటారు.  కానీ చేప గుడ్ల‌ ద్వారా వచ్చే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే మాత్రం అలా చెయ్యరు.  చాలా మందికి చేప గుడ్ల‌ను వండ‌టం తెలియ‌దు. చేప‌లు వండిన‌ట్లుగానే చేప‌గుడ్ల‌ను కూడా ర‌క‌ర‌కాలుగా వండుకోవ‌చ్చు. ఫ్రై చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. అలాగే యూ ట్యూబ్ సాయంతో చేప‌గుడ్ల‌తో వివిధ కూరలు చేసుకుని తినొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చేపల గుడ్లతో ప్రయోజనాలివే :


సాధార‌ణంగా చేప గుడ్లలో విటమిన్ ‌‌- ఎ (Vitamin - A)ఉంటుంది. విటమిన్ ‌‌‌‌- ఎ కంటి చూపును కాపాడటంలో తోడ్ప‌డుతుంది. రెగ్యులర్‌గా చేప గుడ్లు తింటే రక్తంలో (Blood) హిమోగ్లోబిన్ (Hemoglobin)పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో (Anemia) బాధపడేవారికి చేపగుడ్లు దివ్యౌషధంలా ప‌నిచేస్తాయి. చేప గుడ్లలో విటమిన్ ‌‌- డి ( (Vitamin - D)ఉంటుంది. ఇది మీ ఎముకలు, దంతాలను బలంగా త‌యారు చేస్తుంది.  గుండె జబ్బులు రాకుండా విటమిన్ ‌‌-డి కాపాడుతుంది.


Also Read : ఈ సమయంలో నిద్రలేవండి...ఎక్కువ సంపాదించండి!


మతిమరుపు వారికి చాలా మేలు : 


మతిమరపు (alzheimers) స‌మ‌స్య‌ ఉన్నవారు క్ర‌మం తప్పకుండా చేప గుడ్లను తింటే స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం ఉంటుంది. అధిక ర‌క్త‌పోటు (High blood pressure) స‌మ‌స్య ఉన్న‌వారికి చేప గుడ్లు చాలా మంచివి. అలాగే తరచూ చేప‌గుడ్ల‌ను ఆహారంలో తీసుకుంటే బీపీ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. అందువల్ల ఇక నుంచి చేపలతో పాటు అప్పడప్పుడు చేప గుడ్లను కూడా తినండి.


Also Read : నామినేషన్స్ స్టార్ట్... నీ ఆటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో...!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook