Flaxseed Raita: అవిసె గింజల రైతా..దీని వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Flaxseed Raita: రైతా పాలతో తయారు చేసిన తియ్యాని పెరుగు మిశ్రమంతో తయారు చేస్తారు. ప్రస్తుతం వివాహా వింధు బోజనాలలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బోజనం చేసే ముందు వడ్డిస్తారు. రైతా లేకుండా ప్రతి భోజనం అసంపూర్ణ బోజనమని పెద్దలు అంటారు . ఈ మిక్స్‌డ్ కర్డ్‌లో చాలా రకాలున్నాయి.
Flaxseed Raita: రైతా పాలతో తయారు చేసిన తియ్యాని పెరుగు మిశ్రమంతో తయారు చేస్తారు. ప్రస్తుతం వివాహా వింధు బోజనాలలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బోజనం చేసే ముందు వడ్డిస్తారు. రైతా లేకుండా ప్రతి భోజనం అసంపూర్ణ బోజనమని పెద్దలు అంటారు . ఈ మిక్స్‌డ్ కర్డ్‌లో చాలా రకాలున్నాయి. ఇందులో ముఖ్యంగా బూందీ రైతా, వెజ్ రైతా, ఫ్రూట్ రైతా ఎంతో ప్రసిద్ధిచెందినవి. దీనిని పెరుగులో పలు రకాల పదార్థాలను మిక్స్ చేసి తయారు చేస్తారు. కాబట్టి దీనికి మిక్స్‌డ్ కర్డ్ అని పిలుస్తారు. అంతే కాకుండా రైతా మరింత టెస్ట్ వచ్చేందుకు అవిసె గింజలను కూడా వాడవచ్చు. ఇందులో ఈ గింజలను వాడడం వల్ల రైతా మరింత రుచిగా మారుతుంది. అయితే ఈ రైతాను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
అవిసె గింజల రైతాను ఇలా సిద్ధం చేయండి:
మీరు ఇంట్లో సులభంగా రైతాను తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీకి చేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరం ఉండదు. అవిసె రైతా చేయడానికి అరకప్పు అవిసె గింజలు, రెండు కప్పుల పెరుగు, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి ఉప్పు, అర టీస్పూన్ ఎండు మిర్చి పొడి, పచ్చి కొత్తిమీరను తీసుకోవాలి. అవిసె గింజలు రైతా చేయడానికి ముందుగా ఒక గిన్నెలో అవిసె గింజలను నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో పెరుగును తీసి తర్వాత జీలకర్ర పొడి, ఎండుమిర్చి, ఉప్పు వంటి పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత అందులో అవిసె గింజలును వేసి కలపాలి. ఇందులో రైతా మీద పచ్చి కొత్తిమీర వేసి తినడానికి చల్లగా సర్వ్ చేకోవాలి. అవిసె గింజల వేసవి కాలంలో తింటే శరీరానికి మంచి లాభాలు చేకూర్చుతుంది. ముఖ్యంగా శరీరాన్ని చలవగా చేసేందుకు ఇది దోహదపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, తినే ఆహారాన్ని సక్రమంగా జీర్ణమయ్యేట్లు చేస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Diabetes Patient: షుగర్ పేషెంట్స్ ఈ పండ్లను తింటే ప్రమాదమే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి