Bihar Girl Walks To School: దివ్యాంగురాలైన తనకున్నలోపంతో ఏ మాత్రం దిగులు చెందకుండా అంకితభావంతో ఆమె ఒంటి కాలితో భవిష్యత్ కోసం బాటలు వెస్తుతోంది. ఇలా ఉండడం చాలా అరుదు. బీహార్‌కు చెందిన 10 ఏళ్ల బాలిక ధైర్యం, అంకితభావాన్ని చూసి అందరు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఎటు చూసిన అమె వీడియోలే కనిపిస్తున్నాయి. బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక ఒంటికాలితో పాఠశాలకు వెళ్తున్న వీడియోతో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు కోల్పోయింది.
ఆ ఘటన జరిగిన తరువాత ఆమె రెండు కాళ్లు మాత్రమే కోల్పోయింది. కానీ చదువుపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. సీమ చదవుపై ఉన్న ప్రేమతో తన ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతిరోజూ వెళ్తుంది. అయితే ప్రస్తుతం ఒంటికాలిపై పాఠశాలకు వెళ్లే వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
The baby girl Seema of the #Dalit family who belongs to a small village in Jamui district of #Bihar who goes to school walking 1km everyday, walking by one leg. Want to read and want to become a teacher. pic.twitter.com/FDl3bhx8CY
— Komal karanwal (@Komalkaranwal_) May 25, 2022
కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు ఒంటి కాలితో...
ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్తున్న వీడియో చూసి సెలబ్రిటీలు కూడా సీమాను అభినందిస్తున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. సీమ కథ మిగిత దివ్యాంగులకు స్పూర్తిదాయకం కావాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
#Bihar : #Jamui : The spirits are firm on the path of struggle! This 10-year-old Seema goes to school by jumping on the trails for 500 meters to study. Seema has lost a leg in a road accident.
Video: courtesy @abpbihar#India #USA @NitishKumar @UNHumanRights @PMOIndia pic.twitter.com/FMnVpxuSIB
— Vijay kumar🇮🇳 (@vijaykumar1305) May 25, 2022
వీడియోను చూసి స్పందించిన సోనూసూద్:
ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండే బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ వీడియోను చూసి స్పందించారు. సీమకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. సీమా త్వరలో తన రెండు కాళ్లపై పాఠశాలకు వెళ్తుందని సోనూ సూద్ ట్వీట్ చేశారు. సీమాకు కృత్రిమ కాలు పెట్టేందుకు సాయం చేస్తానని సోనూసూద్ ట్వీట్‌లో వెల్లడించారు. 'సీమా రెండు కాళ్లతో త్వరలోనే పాఠశాలకు వెళ్లే సమయం వస్తుందని..పెద్దయ్యాక టీచర్ అవుతుందని' సోనూసూద్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Also Read: Curd Benefits On Hair: పెరుగు వల్ల జుట్టుకు ఇన్ని లాభాలా..!!
Also Read: Dry Fruits Eating Tips: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి