రోజువారీ దైనందిన చర్య సక్రమంగా ఉండాలి. లేకపోతే వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. సమయానికి తినకపోతే కేన్సర్ ముప్పు 25 శాతం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పని వేళలు మారిపోయాయి. షిఫ్టుల్లో పని జరుగుతోంది. దాంతో దినచర్య మారిపోయింది. భోజనం వేళల్లో మార్పు వచ్చేసింది. అయినా సరే సమయానికి తినేందుకు ప్రయత్నం చేయాల్సిందే. ముఖ్యంగా రాత్రి భోజనం అనేది సమయానికి చేయడం చాలా ముఖ్యం. లేకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. రాత్రి భోజనానికి, నిద్రించడానికి మధ్య 2 గంటలు అంతరం ఉండాల్సిందేనంటున్నారు వైద్యులు. లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి కావల్సివస్తుంది. 


సమయానికి తినకపోతే కేన్సర్ ముప్పు


బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ చేసిన ఓ అధ్యయనంలో ఆసక్తికల్గించే నిజాలు వెలుగుచూశాయి. దీర్ఘకాలంపాటు రాత్రి 9 గంటల తరువాత తినడం, ఆ తరువాత నిద్రకు మధ్య 2 గంటలు అంతరం లేకపోవడం అనేది కేన్సర్‌కు కారణంగా అధ్యయనంలో తేలింది. మిగిలిన వారితో పోలిస్తే..ఇలాంటి వ్యక్తుల్లో కేన్సర్ సోకే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంటుంది. 


ఎంతమందిపై అధ్యయనం


ప్రోస్టేట్ కేన్సర్ రోగులు 621, బ్రస్ట్ కేన్సర్ రోగులు 1205 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఇందులో 872 మంది పురుషులు, 1321 మంది మహిళలు ఉన్నారు. వీరంతా నైట్ షిప్ట్‌లో ఎప్పుడూ పనిచేయలేదు. రాత్రి భోజనం చేయడానికి, నిద్రించడానికి మధ్య 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ అంతరం పాటించినవారిలో ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు 20 శాతం తక్కువగా కన్పించింది. అదే ఆలస్యం చేసినవారిలో ఆ ముప్పు 25 శాతం పెరిగింది. 


ప్రతిరోజూ భోజనం ప్యాటర్న్ తప్పకుండా అమలు చేయడం వల్ల కేన్సర్ ముప్పును తగ్గించవచ్చనేది ఈ ఆధ్యయనం ఉద్దేశ్యం. అయితే భోజనం చేసే సమయం అనేది కేన్సర్ ముప్పును ఎలా ప్రభావితం చేస్తుందనేది విషయంపై ఇంకా పరిశోధన అవసరమని తెలుస్తోంది. నిద్రించే వేళల్లో మార్పులు కూడా కేన్సర్ ముప్పును పెంచుతాయి.


Also read: Uric Acid symptoms: శరీరంలో యూరిక్ యాసిడ్ అత్యంత ప్రమాదకరం, ఈ లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook