Winter immunity: చలికాలం తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..
Immunity Booster: చలికాలం వచ్చిందంటే చాలు పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమంటారు. అంతేకాకుండా ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. తరచూ అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అంటే ఈ వింటర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Winter Immunity: చలికాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా జలుబు, దగ్గు చాలా కామన్ గా కనిపిస్తుంది. ఒకపక్క ఎగ్జామ్స్ ఉంటే మరొక పక్క పిల్లలు జ్వరంతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సమయాల్లో పిల్లల కంటే కూడా పెద్దలకే పెద్ద పరీక్ష కాలం. శీతాకాలం వచ్చే శ్వాస కోసం వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల సులభంగా రాకుండా నిరోధించవచ్చు. మన శరీరంలోకి ప్రవేశించాలి అని చూసే వైరల్ ఇన్ఫెక్షన్స్ తో ఇవి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా మన ఇమ్యూన్ సిస్టం ని బాగా అభివృద్ధి చేస్తాయి.
చలికాలం ఎప్పుడూ కూడా మనం తీసుకునే ఆహారం మన శరీరంలోని ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకొని.. సరైన సమయానికి నిద్రపోవడం పొద్దున్నే లేచి కాస్త వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీ జీవనశైలి క్రమబద్ధంగా ఉంటుందో అప్పుడు జీవితంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మరి చలికాలం ఎటువంటి ఆహారం తీసుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుందో తెలుసా?
మామూలుగా ఈ సమయంలో చాలామంది వేడివేడిగా ఉంటుంది కదా అని టీ ,కాఫీ ఎక్కువగా తీసుకుంటారు. మరికొంతమంది హెల్తీ అనే పేరు చెప్పి సూప్స్ విపరీతంగా లాగించేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల శరీరానికి కలిగే మేలు కంటే నష్టమే ఎక్కువ అంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మనకు తెలియకుండా మనం మన శరీరాన్ని కేలరీల తో నింపేస్తాం.. అందుకే ఈ సీజన్ చాలా మంది త్వరగా బరువు కూడా పెరుగుతారు. కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువగా ఈ సమయంలో గోరువెచ్చటి నీటిని సేవించడం అలవాటు చేసుకోవాలి.
ఇక చలికాలంలో మీరు తీసుకునే భోజనంలో కాస్త నెయ్యి తీసుకోవడం శ్రేయస్కరం. నెయ్యి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరంలో ఏర్పడే శ్వాసకోస ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. బెల్లం శరీరానికి అవసరమైన పచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు మన ఇమ్యూనిటీ ను బూస్ట్ చేస్తుంది. బెల్లంలో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలో రక్తహీనత సమస్యను తొలగించడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇక ఈ సీజన్లో సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్, ఆపిల్ ,దానిమ్మ ,బొప్పాయి, జామ ఇలాంటి పండ్లు తీసుకోవడం వల్ల విటమిన్ సి శరీరానికి పుష్కలంగా లభించి రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్స్ దరి చేరవు.
అలాగే రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చటి నీటిలో కాస్త తేనె , నిమ్మకాయ కలుపుకొని సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యానికి హాని కలిగించే టాక్సిన్స్ ను ఇది శరీరం నుంచి సులభంగా తొలగిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి , దగ్గు లాంటి సమస్యలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగినది. ఏదైనా పాటించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు
Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook