Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత

Partial Lunar Eclipse: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేయనున్నారు. చంద్రగ్రహణం పూర్తి అయిన తరువాత తిరిగి 29న తెరవనున్నారు. భక్తులు ఈ మేరకు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2023, 12:58 PM IST
Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత

Partial Lunar Eclipse: తిరుమల భక్తులకు అలర్ట్. అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28న రాత్రి మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరిగి అక్టోబర్ 29న తిరిగి తెరుస్తామని వెల్లడించారు. అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున 1:05 నుంచి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం గంటలకు పూర్తవుతుందని చెప్పారు. అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నామని తెలిపారు. 

గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారని చెప్పారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయన్నారు. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

గురువారం 65,422 మంది భక్తులు తిరుల శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.3.30 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. మూడు కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా) 8 గంటలు పడుతోంది.  

Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి   

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News