Foods for Diabetes: శీతాకాలంలో 6 రోజుల్లో శాశ్వతంగా మధుమేహాన్ని నియంత్రించే ఆహారాలు ఇవే..
Foods for Diabetes: మధుమేహంతో బాధపడేవారు శీతాకాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
Foods For Diabetes Control: భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చలి కాలం ప్రారంభమవుతోంది. నవంబర్ మొదటి వారంలో శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ మార్పుల కారణంగా అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి.
మధుమేహం ఉన్నవారు తప్పకుండా
క్యారెట్:
చలికాలం మార్కెట్‌లో క్యారెట్లు విచ్చలవిడిగా లభిస్తాయి. కాబట్టి వీటిని శీతాకాలంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు క్యారెట్స్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాల విడుదల నెమ్మదిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. క్యారెట్ రసంలో అల్లం వేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఈ చెక్కను ఆహారాల్లో వినియోగిస్తే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దాల్చిన చెక్కలో ఉండే గుణాలు శరీరంలోని గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్‌ను తొలగిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
ఉసిరికాయ:
శీతాకాలంలో టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజు ఉసిరికాయ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఉసిరిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బీట్‌రూట్:
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు బీట్‌రూట్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫైబర్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, ఫైటోకెమికల్స్ లభిస్తాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు మధుమేహం ఉన్నవారు బీట్‌రూట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
నారింజ పండ్లు:
నారింజ పండ్లలో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు నారింజ పండ్లను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook