Foods to Avoid with Eggs: బ్రేక్‌ఫాస్ట్‌ లో చాలా మంది గుడ్లు తినే అలవాటు ఉంటుంది. ఎందుకంటే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వర్కౌట్‌ చేస్తున్న వారు కూడా గుడ్లను తినే అలవాటు ఉంటుంది. గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధిక క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి. గుడ్డులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్‌ కూడా ఉంటాయి. అయితే, గుడ్లతోపాటు తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి మన జీర్ణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల వాటి రుచి పెరగడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే, కొన్ని రకాల ఆహారాలు కలిపి తినకూడదు. అలాగే, గుడ్లతోపాటు తినకూడని ఆహారాలు ఉన్నాయి. వీటిని పొరపాటున కూడా కలిపి తినకూడదట. అవేంటో తెలుసుకుందాం.


 సోయా మిల్క్..
గుడ్లతోపాటు తినకూడని ఆహారాల జాబితాలో మొదటగా వచ్చేది సోయా మిల్క్. ఇందులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. గుడ్లు, సోయా మిల్క్ కలిపి తీసుకోవడం వల్ల ప్రొటీన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది.


చక్కెర..
గుడ్లను చక్కెరను కలిపి వండటం లేదా తినడం వల్ల థియోమైనో యాసిడ్‌ విడుదల అవుతుంది. చక్కెర, గుడ్ల కలిపి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రొటీన్ కెమికల్‌ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గుడ్డు, చక్కెర కలిపి తీసుకోకూడదు.


ఇదీ చదవండి: యూరిక్ యాసిడ్‌ను ఈ 5 కూరగాయలు క్షణాల్లో బయటకు తరిమేస్తాయి..


టీ..
ప్రతిరోజూ ఉదయం టీ తాగుతాం. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌ లో గుడ్డు తినే అలవాటు కూడా ఉంటుంది. అయితే, ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన కడుపు సంబంధింత వ్యాధులు రావచ్చు. కొంతమందికి ఈ ఫుడ్ కాంబినేషన్ ఇష్టపడతారు. టీ తోపాటు గుడ్డను కలిపి తీసుకోవడం వల్ల ప్రొటీన్ స్థాయిలు తగ్గిపోతాయి.  ఇది యాసిడిటీ, కడుపు నొప్పి సమస్యలకు దారితీస్తుంది.


మాంసం..
గుడ్డుతోపాటు మాంసం కూడా తినకూడదు. ఎందుకంటే ఈ కాంబినేషన్ కూడా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గుడ్డులో అధిక శాతం ప్రొటీన్, కొవ్వులు ఉంటాయి. అదే విధంగా మాంసంలో కూడా ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీంతో కడుపు సమస్యలు వస్తాయి. 


ఇదీ చదవండి: ఈ 7 పండ్లను తింటే చాలు.. కీళ్లనొప్పుల సమస్యే ఉండదు..!


అరటిపండు.. 
అరటిపండు అంటే చాలా మందికి ఇష్టం ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, అరటి పండును గుడ్లతోపాటు కలిపి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గుడ్డులో అధిక శాతం ప్రొటీన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి