Foods To Eat During Covid-19: శరీరానికి కాలంలో సంబంధం లేకుండా పోషకాలు కావాలి. తగినంత విటమిన్లు, పోషకాలు లభించే ఆహార పదార్థాలు తినే వారిలో రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ అన్ని రకాల మనుషులపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కోవిడ్19 మహమ్మారి మీ రోగనిరోధక శక్తిని తగ్గించి, మిమ్మల్ని రోగులుగా మారుస్తుంది. కొలంబియా ఆసియా హాస్పిటల్ హెబ్బల్ న్యూట్రిషియన్ అండ్ డైటెటిక్స్ విభాగం చీఫ్ షెర్లీ గణేష్ కొన్ని కీలక వివరాలను షేర్ చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. కరోనా సోకిన వారికి వాసన, రుచిని కోల్పోతారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటారు. కనుక పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ రోగనిరోధకశక్తి మెరుగవుతుంది. తద్వారా కోవిడ్19 (Covid-19) బారి నుంచి త్వరగా కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కొందరిలో గుండె, ఛాతికి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం కరోనా సోకిన సమయంలోనూ వారు తీసుకున్న ఆహారం ప్రభావం చూపుతోంది.


 Also Read: Global COVID-19 Death Toll: ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కరోనా మరణాలు


ఉబకాయులు లేదా స్థూలకాయులు (Obesity Patients)లో శ్వాస సంబంధమైన, రోగనిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి కారణంగా ఊపరితిత్తుల పరిణామం తగ్గుతుంది. నిమోనియా మరియు గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యల బారిన పడతారు. కనుక బరువును తరచుగా చెక్ చేసుకోవాలి. కెలోరీలు ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. అన్నం, బంగాళాదుంప, తృణధాన్యాలు, cereals లాంటివి మీ ఆహారంగా తీసుకోవాలి. చిరుతిళ్లు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం చాలా వరకు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.


Also Read: Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం


పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. తృణధాన్యాలు, పప్పులు, సోయా ఉత్పత్తులు, ధాన్యాలు, విత్తనాలు లాంటివి శాఖాహారులు తమ ఆహారంలో తీసుకోవాలి. మాంసాహారులైతే చికెన్‌, కోడిగుడ్లతో పాటు చేపల్ని తినడం శ్రేయస్కరం. తాజా కూరగాయాలు, పండ్లను తింటే మీకు కావాల్సినంత విటమిన్లు, ఖనిజ లవనాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. పండ్లు, కూరగాయాలు తినడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుతాయి. నీళ్లు తగినంత ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. పళ్ల రసాలు తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.


కోవిడ్19 సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి (Tips While Recovering From Covid)
-  తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవాలి. రోజులపాటు అలాగే ఉంచిన కూరగాయాలు, పండ్లు తినకూడదు.


-  అప్పుడు చేసిన ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకు వేడివేడిగా తీసుకునే ప్రయోజనం ఉంటుంది. 


-  పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. కూరగాయాలు, పండ్లు లాంటివి తినే ముందు పరిశుభ్రంగా కడుక్కోవాలి.


-  కరోనా సోకిన తరువాత వాసన, రుచి తెలియకపోవడంతో కొంత ఆహారం తీసుకున్నా సరిపోయినట్లు అనిపిస్తుంది. కనుక వరుస విరామాలలో ఆహార పదార్థాలు కొద్దిమేర తీసుకోవాలి.


-  రాత్రివేళ తగినంతపోతే సగం సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజూ కొంత సమయం శారీరక శ్రమ చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది.


Also Read: Steroids for Covid-19 Treatment: ఆ కోవిడ్19 బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడకం చాలా ప్రమాదకరం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook