Garlic For High Blood Pressure: వెల్లుల్లిని భారతీయులు తరచుగా వంటకాల్లో వినియోగిస్తారు. ఇది ఆహారాల రుచి పెంచడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇందులో చాలా రకాల ఔషద గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా ఆహారంలో తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా అధిక రక్త పోటు వంటి సమస్యలతో బాధపడుతున్నవారకి వెల్లుల్లి ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే వీటిని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్లుల్లి ప్రయోజనాలు:
1. ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి అధిక రక్త పోటుతో బాధపడుతున్నవారు పచ్చి వెల్లుల్లిని నమలడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది.


2. వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని చలి కాలంలో తీసుకుంటే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.


3. చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొండానికి వేయంచిన వెల్లుల్లిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సిరల్లో అడ్డుపడే కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా  తగ్గుతాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 


Also Read : Jr NTR New Look : ఎన్టీఆర్ న్యూ లుక్.. బండ్లన్న ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్


Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook