Garlic Benefits: రోజూ ఒక్క వెల్లుల్లి రెమ్మ తింటే చాలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం
Garlic Benefits: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి ఓ దివ్యౌషధం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే..
Garlic Benefits: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి ఓ దివ్యౌషధం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే..
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వెల్లుల్లి అద్భుతమైన ఔషధ గుణాల ఖజానా. ఇందులో విటమిన్ బి6, పైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి రెమ్మ 1-2 తీసుకుంటే చాలా రకాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వెల్లుల్లి అనేది సాధారణంగా ప్రతి కిచెన్‌లో ఉండేదే. వంటల రుచి పెరిగేందుకు వెల్లుల్లి వాడుతారు. వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
రోజూ ఉదయం వేళ వెల్లుల్లి రెమ్మ 1 లేదా 2 తీసుకుంటే గ్యాస్ట్రిక్ పీహెచ్ విలువ మెరుగుపడుతుంది. అటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో యాంటీమైక్రోబియల్ గుణాలుంటాయి. ఇవి అల్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వ్యాధుల్ని తగ్గిస్తాయి.
వెల్లుల్లిని రక్తపోటు తగ్గించేందుకు కూడా ఉపయోగిస్తారు. రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి ఒక రెమ్మ తినడం అలవాటు చేసుకుంటే..రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలుంటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సైతం వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి రెమ్మల్ని 1-2 తీసుకుంటే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది.
వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ అనే ఔషధం..కిడ్నీ వైఫల్యం, బ్లడ్ ప్రెషర్, ఆక్సిడేటివ్ ఒత్తిడిని దూరం చేసేందుకు దోహదపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా వెల్లుల్లి ఇమ్యూనిటీని పటిష్టం చేసేందుకు దోహదపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల యాంటీ ఏజీయింగ్ సమస్య కూడా తగ్గుతుంది.
Also read: Weight Loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, ఈ 3 పదార్ధాల్ని దూరంగా పెట్టాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook