Gastric Trouble Home Remedies: ఈ చిట్కాతో గుండెల్లో మంటను క్షణాల్లో మాయం చేయండి
Gas Remedies in Telugu: మీరు అప్పుడప్పుడు గొంతు, గుండెల్లో మంటతో ఇబ్బంది పడుతున్నారా..? ఆయిల్, మసాల ఫుడ్ తిన్నా గొంతులో యాసిడ్ పోసినట్లు ఉంటుందా..? ఈ సమస్యకు సింపుల్‌గా చెక్ పెట్టండి. ఉసిరి కాయతో ఇంట్లోనే ఈ చిట్కాతో పరిష్కరించుకోండి.
Gas Remedies in Telugu: చాలా మందికి ఒక పూట భోజనం చేయకపోయినా.. నూనె, మసాలా ఫుడ్ తిన్నా.. గొంతు, గుండెల్లో మంటతో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. డీప్ ఫ్రైడ్, కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా ఎసీడీటీ, హార్ట్ బర్న్ అంటూ బాధపడటం మీరు చూసే ఉంటారు. ఇందుకోసం వెంట వెంటనే నీళ్లు తాగుతూ మంట నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఆ తరువాత భోజనం చేసే సమయంలోనూ గొంతులో మంట ఇబ్బంది పెడుతుంటుంది. అన్నం తినే సమయంలో ముద్ద ముద్దకు నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో కడుపులోకి అన్నం కంటే.. నీళ్లనే ఎక్కువ పంపిస్తుంటారు. గొంతులో ఎవరో యాసిడ్ పోసిన తరహాలో సహించలేక మంటతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా..? ట్యాబ్లెట్స్ వాడుతూ తాత్కలిక ఉపశమనం పొందుతున్నారా..? ఇక ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు ఇంట్లోనే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ఉసిరికాయతో గొంతులో మంట సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇది జుట్టు, చర్మానికి చాలా ఉపయోగపడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉసిరి కాయ సహాయంతో ఆమ్లత్వం, గుండెల్లో మంట నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తిన్నా.. జంక్ ఫుడ్ తిన్నా కడుపులో మంట రావడం మొదలవుతుంది. సమయానికి తినకపోయినా గుండెల్లో మంట ఉంటుంది.
ఉసిరి పొడిని ఉపయోగించి మంటకు చెక్ పెట్టవచ్చు. ఈ పౌడర్ కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రభావం చూపిస్తుంది. ఉసిరి పండు ప్రతి సీజన్‌లో సులభంగా లభిస్తుంది. దీంతో పాటు ఉసిరి పౌడర్ కూడా మార్కెట్‌లో లభిస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్‌లను తొలగించి ఉపశమనం ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు ఉసిరి పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపండి.
తెల్లవారుజామున నిద్రలేచిన ఉసిరి పౌడర్ కలిపి నీటిని వడపోసి నెమ్మదిగా తాగాలి. కడుపు వేడి, ఆమ్లత్వం, గుండెల్లో మంటను ఉపశమనం కలుగుతుంది. మీకు ఒక్కరోజులో పూర్తి ఉపశమనం పొందకపోతే.. ఉసిరి పొడి, నీళ్లు కలుపుకుని మరుసటి రోజు కూడా తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Weather Updates Today: ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు ఇవే..!
Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook