Ghee With Warm Water: గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగితే శరీరానికి బోలెడు లాభాలు!
Ghee With Warm Water: శీతాకాలంలో గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Ghee With Warm Water: శీతాకాలంలోని వాతావరణంలోని తేమ ఒక్కసారిగా పెరిగిపోయి. చాలా మందిలో సీజన్ వ్యాధుల నుంచి అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే జలుబు, దగ్గు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు చాలా మందిలో చలి కారణంగా శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చలి కాలంలో శరీరం చురుకుగా ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడమే కాకుండా బాడీకి తగిన పోషకాలను అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో ఫైబర్ అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అయితే చాలా మంది ఈ సమయంలో రోజూ ఉదయాన్నే వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
నెయ్యిని ఎందుకు సూపర్ ఫుడ్ అంటారో తెలుసా?:
భారతీయులు నెయ్యిని అన్ని వంటకాల్లో వినియోగిస్తారు. ఎందుకంటే ఇందులో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అందుకే చాలా మంది దీనిని సూపర్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ మరియు డి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది:
శీతాకాలంలో కీళ్ల నొప్పుల ప్రభావం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తాగడం వల్ల అతి తొందరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి:
శీతాకాలంలో చాలా మంది చల్లని గాలుల కారణంగా చర్మంపై అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మంపై ఉన్న కాంతి కూడా సులభంగా తగ్గుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల చర్మం సమస్యలు దూరమవ్వడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
శరీర బరువు నియంత్రణ కోసం:
గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook