Dos And Dont During Periods:  పిరియడ్స్‌ నొప్పి చాలా మంది మహిళలను ప్రభావితం చేసే సమస్య. కొంతమందికి తక్కువగా, మరికొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు కడుపు కండరాలను సంకోచింపజేసి, నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు గర్భాశయం, గర్భాశయ గొట్టాలలో సంకోచాలు కూడా నొప్పికి కారణం కావచ్చు. గర్భాశయం వెలుపల గర్భాశయం అంతర్పొర కణాలు పెరిగితే, ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది కూడా నొప్పికి కారణం కావచ్చు. అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి నొప్పిని పెంచుతాయి.  ఈ నొప్పిని తగ్గించుకోవడానికి మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం చాలా అవసరం. అయితే పిరియడ్స్‌ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుతుక్రమ నొప్పికి కారణమయ్యే ఆరు ప్రధాన పొరపాట్లు:


చాలా మంది పిరియడ్స్‌ ముందు పిరియడ్స్‌ సమయంలో జంక్ ఫుడ్, కొవ్వు ఆహారం, ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కడుపులో నొప్పిని పెంచుతుంది. శరీరంలో నీరు తక్కువగా ఉంటే, రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది కడుపులో కండరాలను గట్టిపడేసి నొప్పిని పెంచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరం సరిగా విశ్రాంతి తీసుకోదు. ఇది హార్మోన్లను ప్రభావితం చేసి నొప్పిని పెంచుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సింత నిద్రపోవడం చాలా అవసరం. రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్య కలుగుతుంది. వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నొప్పిని తగ్గిస్తుంది. త్తిడి హార్మోన్లను ప్రభావితం చేసి నొప్పిని పెంచుతుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కాఫీ, ఆల్కహాల్, ధూమపానం వాటిని అధికంగా తీసుకోవడం హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది రుతుక్రమ నొప్పిని పెంచుతుంది. శీతల పానీయాలు కడుపులో కండరాలను సంకోచింపజేసి నొప్పిని పెంచుతాయి. పిండి పదార్థాలు వాయువులను పెంచి, కడుపులో నొప్పిని కలిగిస్తాయి. కాబట్టి ఈ పనులు చేయడకుండా ఉండటం వల్ల కడుపు నొప్పి సమస్య రాకుండా ఉంటుంది. ఇప్పుడు పిరియడ్స్ సమయంలో ఎలాంటి పనులు చేయడం వల్ల కడుపు నొప్పి రాకుండా ఉంటుంది అనేది తెలుసుకుందాం. 


కడుపు నొప్పిని తగ్గించుకోవడానికి ఇతర చిట్కాలు:


కడుపుపై హీటింగ్ ప్యాడ్ ఉంచడం నొప్పిని తగ్గిస్తుంది. తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు వేడి పసుపు నీళ్లు తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. విటమిన్ డి హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నొప్పి చాలా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


ముఖ్యమైన విషయం: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.