Gourd Benefits: అన్ని రకాల పోషకాలతో కూడిన కూరగాయలలో సొరకాయ(Gourd)ఒకటి. దీనిని వండుకొని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్ లు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే దీని తినడం ద్వారా వచ్చే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒత్తిడిని తగ్గిస్తుంది:


సొరకాయ తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుందని తెలుపుతున్నారు. సొరకాయలో ఉండే గుణాలు శరీరానికి రిలాక్స్ ఇవ్వడమే కాకుండా..బరువు కూడా సులభంగా తగ్గుతాయని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.



జీర్ణక్రియలో సరకాయ ఎంత మేలు చేస్తుంది..?


సొరకాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయి. పొట్లకాయలో జీర్ణక్రియను మెరుగుపరిచే  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ ట్రబుల్స్, పొట్టలో సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో దీని వినియోగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయను తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరతను తగ్గించి.. డీహైడ్రేషన్ బారినపడకుండా పాడుతుంది.


(నోట్: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Hair Care Tips: జుట్టులోని రూట్స్ వద్ద అధిక నొప్పితో బాధపడుతున్నారా...! అయితే ఈ చిట్కా ఉపయోగించి ఉపశమనం పొందండి..!!


Also Read: Uber Ride Fares: పెరిగిన ఊబెర్ రైడ్ ధరలు, పాసెంజర్లకు మరింత భారం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.