Hair Root Pain: మారుతున్న జీవన శైలి కారణంగా ప్రతి నలుగురిలో ఒకరు జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతే కాకుండా తలలోని రూట్స్ వద్ద నొప్పి రావడం వంటి వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జుట్టు మూలాల్లో నొప్పులు రావడం, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు అధికమైపోయాయి. ఇలాంటి సమస్యల కారణంగా తలలోని చర్మంలో రక్త నాళాల వాపు వచ్చి, నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని సహజమైన చిట్కాలను తెలుసుకుందాం..
జుట్టు మూలాలలో నొప్పి ఉంటే ఈ పని చేయండి:
వదులైన జుట్టు:
జుట్టును గట్టిగా కట్టడం ద్వారా జుట్టు యొక్క మూలాలు సాగిపోతూ ఉంటాయి. అంతే కాకుండా చర్మం వాపు. అటువంటి పరిస్థితిలో జుట్టు కూడా రాలడం మొదలవుతుంది. కావున జుట్టు మూలాలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మార్కెట్ ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ కూడా జుట్టుకు హాని కలిగిస్తున్నయని పేర్కొన్నారు. ఇవి జుట్టు మూలాలను పొడిగా చేయడమే కాకుండా తీవ్రమైన నొప్పికి దారితీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. స్కాల్ప్‌లోని మురికితో పాటు బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తలపై చర్మాన్ని శుభ్రం చేయండి:
స్కాల్ప్‌ను శుభ్రం చేయడం ద్వారా నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. జుట్టును సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల తలపై మురికి చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని కారణంగా హెయిర్ రూట్స్‌లో మంటలు, నొప్పికి దారితీస్తుంది. కావున ప్రతిరోజూ జుట్టును కడగడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Egg Side Effects: గుడ్డు తిన్న వెంటనే ఈ 4 ఆహార పదార్థాలు అసలు తినొద్దు!
Also Read: Mango Season: మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా మామిడి పండ్లను తినొచ్చు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook