Green Chilli Benefits and Side Effects: పచ్చి మిరపకాయలు భోజనం అసంపూర్ణమని పెద్దలు చెబుతుంటారు. ప్రతి భారతీయ వంటకంలో పచ్చి మిరపకాయ తప్పనిసరి. వీటి కూరలు వండే క్రమంలో కారం కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా  స్పైసీ ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. చైనీస్‌ ఫుడ్, బిర్యానీలలో వీటి వాడకం తప్పనిసరిగా మారింది. అయితే పచ్చి మిరపకాయలో కూడా చాలా రకాల పోషకాలుంటాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల  ఆరోగ్యానికి ఎంలాంటి మేలు జరగుతుందో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పచ్చిమిర్చి ఆరోగ్యానికి మేలు చేస్తుందా..!


పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, కాపర్, పొటాషియం, ప్రొటీన్, కార్బోహైడ్రేట్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాదు.. ఇందులో  బీటా కెరోటిన్, క్రిప్టోక్సాంటిన్, లుటిన్-జియాక్సంథిన్ మొదలైన ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి.


పచ్చి మిర్చి శరీరానికి చేసే ప్రయోజనాలు


1. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:


ఊబకాయం కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ తరుణంలో పచ్చి మిరపకాయలను తీసుకుంటే.. బరువును నియంత్రించేందుకు సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.


2. కళ్లకు మేలు చేస్తుంది:


పచ్చి మిరపకాయ కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది.


3. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది:


మిరపకాయతో క్యాన్సర్‌ సమస్యను చాలా వరకు దూరంగా ఉంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదుంలో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


4. ఆరోగ్యాకరమైన గుండె కోసం:


గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు పచ్చి మిరపకాయ చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం గుండెను ఆరోగ్యంగా చేస్తుంది. ఇతర జబ్బుల నుంచి గుండెకు రక్షణ కల్పిస్తుంది.


5. చర్మానికి మేలు చాలా మేలు చేస్తుంది:


పచ్చి మిరపకాయలో విటమిన్-ఇ సమృద్ధిగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా ఉంచుతాయి.


 6. జీర్ణక్రియను మెరుగు పరుచుతుంది:


పచ్చి మిరపకాయ కూడా జీర్ణవ్యవస్థను సజావుగా నడిపించడానికి కీలకపాత్ర పోషిస్తుంది.  వీటిలో ఉండే గుణాలు జీర్ణశయ రుగ్మతలపై ప్రభావవంతగా పని చేస్తాయి.


7. శ్వాసకోశ వ్యవస్థ దృఢంగా చేస్తాయి:


మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ ముక్కులో ఉన్న శ్లేష్మ పొరలను ప్రేరేపిస్తుంది. ఇది మూసుకుపోయిన శ్వాసకోశ వ్యవస్థను తిరిగి తెరిపించేందుకు ప్రభావవంతగా పని చేస్తాయి.


8. రక్తపోటును నియంత్రింస్తుంది:


అధిక రక్తపోటు గుండె సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీహైపెర్టెన్సివ్ లక్షణాలు.. రక్తపోటును తగ్గించడానికి కృషి చేస్తాయి.


పచ్చి మిరపకాయలను అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు:


పచ్చిమిర్చితో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అన్నే నష్టాలున్నాయి. అయితే వీటిని  ఒక రోజులో ఎన్నితినాలో తెలుసుకుందాం.


- న్యూట్రియెంట్స్ జర్నల్ ఆఫ్ చైనాలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పచ్చి మిరపకాయలు శరీరనికి చాలా నష్టాలను కలిగించవచ్చని పేర్కొంది.


- వీటిని రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ తింటే.. డిమెన్షియా వంటి పరిస్థితికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.


- పచ్చి మిరపకాయలను అతిగా తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగే అవకాశాలున్నాయి.


- వీటిని ఎక్కువగా తినడం వల్ల పొట్టలో జరిగే రసాయనిక చర్య వల్ల పొట్టలో మంటలు, ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


- పచ్చి మిరపకాయ కూడా అసిడిటీకి కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది


Also Read:  White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలను తింటే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.