Guava Leaves For Weight Loss: జామ ఆకుల టీతో బరువు తగ్గొచ్చా? ఈ టీతో లాభాలు తెలుసుకోండి!
Guava Leaves For Weight Loss In 8 Days: బరువు తగ్గాలనుకునేవారు జామ ఆకుల టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తాయి.
Guava Leaves For Weight Loss In 8 Days: బరువు తగ్గడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. వేట్ లాస్ అవ్వడానికి ప్రతి రోజు వ్యాయామాలు చేయడమేకాకుండా డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఎలాంటి పద్ధతులను అనుసరించకుండా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించి పలు చిట్కాలు పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. ప్రతి రోజు జామ ఆకులు, గుజ్జు వినియోగించడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతి రోజు వీటిని వినియోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండమేకాకుండా బరువు సులభంగా తగ్గుతారు.
జామ ఆకులు శరీర బరువును నియంత్రిస్తుందా?:
బరువు తగ్గడానికి మార్కెట్ చాలా రకాల ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వినియోగించడం వల్ల బరువు తగ్గలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జామ ఆకులను ప్రతి రోజు వినియోగించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులతో ఎలా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ
పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసా?:
జామ ఆకులతో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు పేర్కొన్నాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
బరువు తగ్గడం ఖాయమేనా?:
జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇది శరీర ఒత్తిడిని తగ్గించి.. శరీర బరువును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు రెండు నుంచి మూడు సార్లు ఈ టీని తాగాల్సి ఉంటుంది. ఇందలో కాటెచిన్స్, క్వెర్సెటిన్, గాలిక్ యాసిడ్ సమ్మేళనాల కూడా లభిస్తాయి. దీంతో మీరు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.
హెర్బల్ టీలు తాగడం మంచిదేనా?:
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం..జామ ఆకులు బరువు తగ్గడాని సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు హెర్బల్ టీలను తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీలను తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి