H3N2 Virus Alert: దేశంలో పెరుగుతున్న హెచ్3ఎన్2 వైరస్, రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
H3N2 Virus Alert: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ సైతం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది
H3N2 Virus Alert: కరోనా వైరస్ నుంచి కోలుకున్నామని ఊపిరి పీల్చుకునేలోగా కొత్త వైరస్ భయపెడుతోంది. హెచ్3ఎన్2 వైరస్ ఇప్పుడు దేశంలో ఆందోళన కల్గిస్తోంది. హెచ్3ఎన్2 ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది, ఎవరికి తీవ్రంగా మారనుందనే వివరాలు తెలుసుకుందాం..
హెచ్3ఎన్2. ఇప్పుడీ విషయమే చర్చనీయాంశమౌతోంది. భయపెడుతున్న ఈ కొత్త వైరస్ దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తోంది. హెచ్3ఎన్2 వైరస్ ముప్పు ఎవరికి అధికంగా ఉంటుంది, కొత్త వైరస్ లక్షణాలుంటే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్థులకు ఈ వైరస్ ఎలా పరిణమించనుందనే వివరాలు తెలుసుకోవల్సిన అవసరముంది. వివిధ ల్యాబొరేటరీల్లో పరిశీలిస్తున్న శాంపిల్స్‌లో ఇన్‌ఫ్లుయెంజా ఏ అంటే హెచ్3ఎన్2 వైరస్ కనుగొనడం ఆందోళన కల్గిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్వయంగా వెల్లడించారు. వృద్ధులు, చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా మారవచ్చని తెలుస్తోంది.హెచ్ఐఎన్1, హెచ్3ఎన్2, అడినోవైరస్ వృద్ధులు, చిన్నారులకు ఇబ్బంది కల్గించవచ్చని తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉండాల్సిందే
గత కొద్ది నెలలుగా దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గినా వివిధ రాష్ట్రాల్లో పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ తేలడం ఆందోళన కల్గిస్తోందని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అందుకే అప్రమత్తంగా ఉండి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో పెద్దఎత్తున జరిగినా ఇప్పటికీ టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ వ్యూహం అమలు చేయాలని సూచిస్తోంది.
వృద్ధులు, స్థూలకాయంతో బాధపడుతున్నవారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులున్నవాళ్లు, గర్ణిణీ మహిళలు హెచ్3ఎన్2 వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
Also read: Constipation Relief: ఈ హల్వాతో పొట్ట సమస్యలేవైన సరే అన్నింటికీ చెక్! నమ్మట్లేదా ఇది చదవండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook