Hair Treatment Tips: వాతావరణ మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలతో చాలా మంది సతమతమవుతున్నారు. అయితే వాటి నుంచి విముక్తి పొందేందుకు ఎన్నో రెమెడీస్ వాడినా ఫలితం లేకపోతే.. ఒక్కసారి ఈ చిట్కాను పాటించి చూడండి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడం సహా తెల్ల జుట్టును నివారిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉల్లిపాయ రసంతో..


ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడడం వల్ల వెంట్రుకలు శుభ్రంగా మారడం సహా రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు కుదుళ్లలో శుభ్రంగా ఉండడం మూలంగా జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఉల్లి రసాన్ని వినియోగించడం వల్ల జుట్టు కుదుళ్లలో దుమ్ము, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ చేరవు. 


జుట్టు పెరుగుదలకు సహకారం..


వెంట్రుకలు దట్టంగా పెరగాలన్నా, మందంగా ఉండాలన్నా ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుంది. ఉల్లి రసాన్ని జుట్టుకు పట్టించడం లేదా కొబ్బరినూనెతో కలిపి దీన్ని మసాజ్ చేయవచ్చు. వారం రోజుల తర్వాత మీకే వ్యత్యాసం కనిపిస్తుంది. 


ఉల్లిపాయ రసాన్ని ఇలా సిద్ధం చేసుకోండి!


1) ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 


2) ఆ తర్వాత వాటిని మిక్సర్ గ్రైండర్ లేదా రోకలితో రుబ్బి దాని నుంచి రసం తీసుకోవాలి. 


3) ఆ మిశ్రమాన్ని నిమ్మరసంతో కలిపాలి. 


4) దీని తర్వాత విటమిన్ - ఈ క్యాప్సూల్స్ లోని నూనెను అందులో జోడించాలి. 


5) ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. 


Also Read: Buttermilk Benefits: ఎండల కాలంలో మజ్జిగ అధికంగా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?


Also Read: Cholesterol Reducing Dry Fruits: శరీరంలో అధిక కొలెస్ట్రాల్ నివారణ కోసం ఇలా చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.