Buttermilk Benefits: ఎండల కాలంలో మజ్జిగ అధికంగా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Buttermilk Benefits: మే నెలలో ఎండల తాపం మరింత పెరగనుంది. ఈ క్రమంలో ఎండల తాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 05:02 PM IST
Buttermilk Benefits: ఎండల కాలంలో మజ్జిగ అధికంగా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Buttermilk Benefits: వేసవిలో ఫిట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉండటానికి.. మీ శరీరానికి తగిన నీటి శాతం అందాలి. అందుకోసం పుచ్చకాయ, దోసకాయ వంటి శీతలపానీయాలను తీసుకోవడం మేలు. దాని వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ క్రమంలో వేసవిలో మజ్జిగ ఎక్కువ తాగాలని ఇంట్లోని పెద్దవారు సూచిస్తుంటారు. ఈ క్రమంలో మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు..

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం సాధారణం. సూర్యకాంతి, చెమట కారణంగా శరీలంలోని అధిక నీటి శాతం బయటకు వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం పుష్కలంగా నీరు తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని అందించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. 

కడుపుకు మేలు చేస్తుంది!

రోజూ మజ్జిగ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. మజ్జిగ ఎక్కువ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవ్వడం సహా కడుపులోని వాంతి ఫీలింగ్ ను తగ్గిస్తుంది. దీంతో పాటు ఆకలిని పెంచుతుంది. 

కొలెస్ట్రాల్ తగ్గేందుకు..

శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు మజ్జిగ బాగా తాగాలి. అలా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. 

ఎముకల్లో బలం కోసం..

ఎముకల బలహీనతతో బాధపడే వారు రోజూ మజ్జిగ తాగడం వల్ల మేలు కలుగుతుంది. ఎముకల్లో పటుత్వం కోసం రోజూ మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. 

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)              

Also Read: Cholesterol Reducing Dry Fruits: శరీరంలో అధిక కొలెస్ట్రాల్ నివారణ కోసం ఇలా చేయండి!

Also Read: Melon Benefits: కర్బూజతో వేసవిలో చల్లదనంతో పాటు అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News