Cholesterol Reducing Dry Fruits: శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో లేకుంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం పొంచిఉన్నట్లే. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ బాదంపప్పు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు బాదంపప్పు సహకరిస్తుంది. బాదం పప్పు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాదంపప్పు తినడం వల్ల డ్రైఫ్రూట్ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తుంది.
డయాబెటిక్స్ మేలు..
డయాబెటిక్ రోగులకు కూడా బాదంపప్పు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి.. మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు నియంత్రణకు..
బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి ఫీలింగ్ రాదు. దీంతో ఎక్కువ తినే బాధతప్పినట్లు అయ్యింది. దీంతో ఎక్కువగా తినకపోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. బాదంపప్పులోని విటమిన్ - ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడుకు శక్తిని ఇస్తుంది.
చర్మంపై మెరుపుకోసం..
ఉదయాన్నే పరగడుపున బాదంపప్పు తినడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. అంతే కాకుండా మెదడుకు మేలు జరుగుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు, ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Melon Benefits: కర్బూజతో వేసవిలో చల్లదనంతో పాటు అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు!
Also Read: Cholesterol Control Tips: మామిడి పండుతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కు చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.