Basmati Rice Benefits: బాస్మతి బియ్యాన్ని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో!
Basmati Rice Good For Health: బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ఫలితాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ బాస్మతి రైస్‌తో శరీరానిని ఎంతో దృఢంగా తయారు చేసుకోవచ్చు. అయితే బాస్మతి రైస్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Basmati Rice Good For Health: భారత దేశంలో సాంప్రదాయకంగా పండిస్తున్న అరోమాటిక్ బియ్యం ఈ బాస్మతి. ఇవి చూడడానికి సన్నాగా, పొడుగ్గా ఉంటాయి. ఈ రైస్‌ను ఎక్కువగా బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైస్‌లో ఉపయోగిస్తాము. అయితే బాస్మతి బియ్యాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే బాస్మతి రైస్‌తో కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాస్మతి రైస్‌లోని థయామిన్ వల్ల మెదడకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కాకుండా ఈ బాస్మతిని తృణధాన్యాలతో పాటు కలిపి తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. బాస్మతి రైస్‌లో ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. బాస్మతి రైస్ మార్కెట్‌లో వివిధ రకాలుగా లభిస్తుంది. ఇందులో గోధుమ బాస్మతి రైస్ వంటి తృణధాన్యాలు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
Also read: Amla-aloe Juice: ఉసిరి,అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ గోధుమ బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలను నయం చేయడంలో ఈ రైస్ ఎంతో సహాయపడుతుంది.
కీళ్ల సమస్యలతో బాధపడే వారు ఈ రైస్ తీసుకోవడం వల్ల ఎముకలకు బలం లభిస్తుంది. అంతేకాకుండా బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
Also read: Turmeric Milk Benefits: శీతాకాలంలో పసుపును పాలలో కలుపుకొని తాగితే శరీరానికి బోలెడు లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter