Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు, ప్రాణాంతక వ్యాధులు సైతం దూరం
Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు లేదా డ్రైఫ్రూట్స్‌లో అద్భుతమైన ఔషధం ఖర్జూరం. రోజుకు 2 ఖర్జూరం పండ్లు తింటే చాలు..ప్రాణాంతకమైన చాలా వ్యాధులు దూరమైనట్టే..
ఎడారి ప్రాంతంలో లభించే అద్భుతమైన ఔషధగుణాలు కలిగిన పండు ఖర్జూరం. ఖర్జూరం క్రమం తప్పకుండా తింటే..చాలా ప్రాణాంతక వ్యాధులు దూరమౌతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఇండియలో ఖర్జూరంను డెకొరేటివ్ ఆహార పదార్ధంగా వినియోగిస్తుంటారు. ఖర్జూరంను వివిధ రకాల మిఠాయిల తయారీలో వాడుతుంటారు. చాలా రకాల వంటల్లో ఖర్జూరం తప్పకుండా ఉపయోగిస్తారు. అయితే ఖర్జూరం అనేది అద్భుతమైన ఆరోగ్యపరమైన ఔషధం అని చాలా మందికి తెలియదు. రోజూ క్రమం తప్పకుండా ఖర్జూరం తింటే డయాబెటిస్, అల్జీమర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు తగ్గుతుంది. గర్భిణీ మహిళలు ఖర్జూరం తింటే..కాన్పు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఖర్జూరం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.
పాలతో ఖర్జూరం లాభాలు
ఖర్జూరంలో ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకల పటిష్టతకు ప్రయోజనకరం. ఇవి ఎముకల్ని స్ట్రాంగ్‌గా చేస్తాయి. ఎముకలకు సంబంధించి సమస్యలు దూరమౌతాయి. ఖర్జూరం తినడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.
ఖర్జూరం కంటి వెలుగును పెంచుతుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటికి సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. అటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఖర్జూరంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్‌లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇందులోని ప్రోటీన్లు మజిల్స్‌ను బలోపేతం చేస్తాయి. దెబ్బతిన్న కణజాలాన్ని సెట్ చేస్తాయి.
శరీరంలో ఫైబర్ లోపం కారణంగా తలెత్తే మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలకు ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఖర్జూరంను పాలతో కలిపి తీసుకుంటే..కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. రోజుకు రెండు ఖర్జూరం పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే..ఎన్నో ప్రాణాంతక వ్యాధులు కూడా దూరమౌతాయి.
Also read: Weight loss Tip: రోజూ ఆ నీళ్లు తాగితే..నెల రోజుల్లో మీ కొవ్వు కరగడం, బరువు తగ్గడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook