Copper Infused Water: రాగి పాత్రలో నీరు తాగిన వ్యక్తి రోగి అవడట!
Copper For Healthy Heart | మానవ శరీరం 70 శాతం నీటితో నిండి ఉంటుంది. బతకడానికి నీరు అత్యవసరం. మన పూర్వికులు రాగి పాత్రలోనే నీరు తాగేవారు అని మనకు తెలిసిందే. ఇలా ఎందుకు చేసేవారో తెలుసా ?
Health Benefits of Copper Infused Water | మానవ శరీరం 70 శాతం నీటితో నిండి ఉంటుంది. బతకడానికి నీరు అత్యవసరం. మన పూర్వికులు రాగి పాత్రలోనే నీరు తాగేవారు అని మనకు తెలిసిందే. ఇలా ఎందుకు చేసేవారో తెలుసా ? ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం మనం రాగి పాత్రలో/ గ్లాసులో/ బాటిల్లో నీరు తాగడం వల్ల వాత, కఫ, పిల్ల దోషాలు తొలిగిపోతాయట. శరీరాన్ని సహజమార్గంలో క్లీన్ చేస్తుందట.
Also Read | Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి
రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలివే
1. జీర్ణ వ్యవస్థకు మేలు..
రాగి (Copper) పాత్రలో నీరు తాగడంవ వల్ల ఎన్నో బ్యాక్టిరియాలు అంతం అవుతాయట. పొట్టలో మంటను కూడా తగ్గిస్తుందట. జీర్ణక్రియను వేగవంతం చేసి అల్సర్, ఇతర ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది. శరీరంలో ఉన్న విషతుల్యాలను దూరం చేస్తుంది.
2. బరువు తగ్గడంలో...
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తోంటే.. రాగిపాత్రలో నీరు తాగండి. శరీరంలో ఉన్న కొవ్వును (Fat) అది తరిగేలా చేస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది.
Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
3. మడతలను తగ్గిస్తుంది
రాగి పాత్రలో మంచినీళ్లు తాగడం వల్ల కలిగే అనేక ఉపయోగాల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..చర్మానికి (Skin) కూడా అనేక ఉపయోగాలు కలుగుతాయి. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. కణాల పునరుత్పత్తి పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది.
4. గుండెకు మంచిది | Copper For Healthy Heart
గుండె జబ్బులు తగ్గాలి అంటే...ప్రతీ రోజు రాగిపాత్రలో నీరు తాగడం మంచిది. రక్తప్రసరణను ( Blood Pressure) మెరుగుపరుస్తుంది. గుండెకొట్టుకునే వేగాన్ని నియంత్రించి సరిదిద్దుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR