Drinking Tulsi Water Daily: ప్రతీ రోజు తులసీ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా ?
Health Benefits of Drinking Tulsi Water Daily: తులసి అంటేనే ఎంతో పవిత్రమైన మొక్కలా, దైవంలా భావిస్తుంటాం. ఇక తులసీ దళాలతో చేసిన నీటిని తులసి తీర్థం అనే పిలుస్తుంటాం. పేరుకి తగినట్టుగానే తీర్థానికి ఎన్ని మహిమలు ఉంటాయో.. తులసి నీటితోనూ ఆరోగ్యానికి అన్ని ప్రయోజనాలు ఉంటాయి అని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
Health Benefits of Drinking Tulsi Water Daily: తులసి అంటేనే ఎంతో పవిత్రమైన మొక్కలా, దైవంలా భావిస్తుంటాం. ఇక తులసీ దళాలతో చేసిన నీటిని తులసి తీర్థం అనే పిలుస్తుంటాం. పేరుకి తగినట్టుగానే తీర్థానికి ఎన్ని మహిమలు ఉంటాయో.. తులసి నీటితోనూ ఆరోగ్యానికి అన్ని ప్రయోజనాలు ఉంటాయి అని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
తులసీ ఆకులతో చేసిన నీటికి రోగ నిరోధక శక్తిని పెంచే కెపాసిటీ కలిగి ఉంటుంది. తులసీ నీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి మీ ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని ఇస్తాయి. అందుకే ప్రతీ రోజు తులసీ నీటిని సేవించడం ఒంటికి మంచిది.
ప్రతీ రోజూ తులసీ నీటిని తాగడం వల్ల అది ఒంట్లోని మలినాలను వ్యర్ధాల రూపంలో బయటికి పంపిస్తుంది. పొట్ట శుభ్రం అవుతుంది. పేగులు కూడా శుభ్రం అవుతాయి. మీరు తీసుకునే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
ప్రతీ రోజు తులసీ నీటిని తాగేవారిలో శరీరంలో, కీళ్లలో మంటలు రావడం అంటూ ఉండదు. ఎందుకంటే తులసీ నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దాగి ఉంటాయి.
ప్రతీ రోజూ తులసీ నీరు తాగే వారిలో మానసిక ఆందోళన, శారీరక ఒత్తిడి వంటి సమస్యలు పెద్దగా కనిపించవు. ఎందుకంటే తులసీ నీటికి యాంటీ యాంగ్జైటీ గుణాలు ఎక్కువ.
తులసి నీటితో పుక్కిలించి ఊంచడం వల్ల నోరు శుభ్రమవడమే కాకుండా చెడు దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓరల్ హెల్త్ కి కూడా తులసి నీరు దివ్యమైన ఔషదం తరహాలో పనిచేస్తుంది.
జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడే వారు కూడా తులసి నీరు తీసుకుంటే.. వారికి ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Things to Know About Dengue Fever: డెంగ్యూ జ్వరం సోకిన వాళ్లు ఎలాంటి ఫుడ్ తినొద్దంటే..
చలికాలం, వానా కాలంలో కొంతమంది గొంతులో ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటప్పుడు తులసి దళాలు వేసి మరగబెట్టిన టీ చేసుకుని సేవిస్తే.. తప్పకుండా ఉపశమనం కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి : Foods For Men's Health: మగాళ్లు తప్పక తినాల్సిన ఆహార పదార్థాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి