Green Tomatoes: టమాటో.. కూరల దగ్గర నుంచి సలాడ్స్ వరకు.. శాండ్విచ్ దగ్గర నుంచి బిర్యానీ వరకు.. కచ్చితంగా ఉండాల్సిన కూరగాయ. మనలో చాలామందికి బాగా మాగిన టమాటాలో చక్కెర కలుపుకొని తినడం కూడా ఇష్టమే. దీంతో పచ్చడి దగ్గర నుంచి ఊరగాయ వరకు చేసుకుంటాం. టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది అన్న విషయం మనకు తెలుసు. అయితే పచ్చి టమాటో తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా. అవునండి బాబు.. వినడానికి విచిత్రంగా ఉన్న గ్రీన్ టమాటో లో ఎన్నో బెనిఫిట్స్ దాగి ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నపిల్లలకు ఔషధం..


గ్రీన్ టమాటో తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది అంటున్నారు నిపుణులు. పచ్చి టమాటాలో క్యాల్షియం ,పొటాషియం, విటమిన్ సి, ఏ తో పాటుగా ఫైటో కెమికల్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇది మన శరీరానికి అవసరమైనటువంటి పౌష్టిక తత్వాలను అందిస్తాయి. ఇందులో సమృద్ధిగా దొరికే కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. అందుకే చిన్న పిల్లలకి అప్పుడప్పుడు ఈ పచ్చి టమాటాలు తినిపించడం వల్ల వాళ్ళ ఎముకలు బలంగా తయారవుతాయి.


కంటికి మేలు..


గ్రీన్ టమాటోస్ లో బీటా కెరటిన్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. దీనివల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక చిన్న గ్రీన్ టమాటో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు గ్రీన్ టమాటో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారడమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.


ఇన్ఫెక్షన్స్ దూరం..


పచ్చి టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. ఇది పలు రకాల ఇన్ఫెక్షన్స్ ని దూరం పెడుతుంది. అంతేకాదు క్యాన్సర్ సంబంధిత కణాలను నివారించడంలో కూడా పచ్చ టమాటాలు ఉపయోగపడతాయట. హై బీపీ ఉన్నవాళ్లు ఇది తినడం వల్ల బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సీజనల్ వ్యాధులు మన దరిచేరకుండా కాపాడడంలో కూడా గ్రీన్ టమాటో ఎంతగానో సహాయపడుతుంది. 


అయితే ఇన్ని సుగుణాలు ఉన్న గ్రీన్ టమోటా ను నేరుగా ఎలా తినాలి అని ఆలోచిస్తున్నారా?



గ్రీన్ టమాటో చూడడానికి బాగుంటుంది కానీ తినడానికి బాగా పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని చిన్న ముక్కలు చేసి సలాడ్ వంటి వాటిల్లో కలిపేయవచ్చు. పచ్చి టమాటాలను కూరల్లో , సూప్స్ లో, స్మూతీస్ లో వాడుకోవచ్చు. లేదా నేరుగా కూడా కాస్త ఉప్పు ,కారం చల్లుకొని తినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ టమోటాను మీ డైట్ లో భాగంగా చేసుకోండి.



గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 


Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు


Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook