Health benefits of eggs: గుడ్డు తీసుకుంటే కలిగే లాభాల గురించి చెప్పాలంటే ముందుగా మీకు ఇంకో విషయం చెప్పాలి. రోజూ ఒక యాపిల్ ( Eating apple benefits ) తింటే అసలు వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అంటుంటారు మన పెద్దలు. అది యాపిల్‌కి ఉండే గొప్ప లక్షణాల గురించి చెప్పే క్రమంలో అలా చెబుతుంటారు. ఐతే ఒక గుడ్డులో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కన్నా దాదాపు రెండింతలు ఎక్కువ ఉంటాయట. అంటే గుడ్డు ఆరోగ్యానికి ఇంకెంత మేలు చేస్తుందో మీరే ఆలోచించండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే గుడ్డుతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, చిన్నారులకు రోజూ కోడి గుడ్లు, పాలు ( Eggs, milk health benefits ) వంటి పౌష్టికాహారాన్ని అందిస్తుంటాయి. Also read: Dry Cough: ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుడ్డులో ఉండే పౌష్టకాల విషయానికొస్తే.. మానవ శరీరానికి 13 రకాల విటమిన్స్, మినరల్స్‌, శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్స్, ఆరోగ్యాన్ని కాపాడే కీలకమైన యాంటి ఆక్సిడెంట్స్ శరీరానికి గుడ్డు ద్వారా సమకూరుతాయి. రోజూ ఒక ఉడుకబెట్టిన గుడ్డు తింటే ( Eating boiled eggs ).. 77 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్స్, 5 గ్రాముల హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అందుతాయి. ఇవే కాకుండా కోడిగుడ్డులో విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె, విటమిన్ బి6, క్యాల్షియం, జింక్ ఒక భాగంగా ఉంటాయి. అందుకే రోజూ రెండు కోడి గుడ్లు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Also read: Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి


Eye sight: కంటి చూపును మెరుగుపరిచే యాంటి ఆక్సిడెంట్స్ వృద్ధి చెందుతాయి.


Heart Diseases: గుండెజబ్బులను తగ్గిస్తాయి. 


Protects from Cancer: క్యాన్సర్ నుంచి కాపాడతాయి.


Proteins and minerals in Egg: శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి.


Protein, Amino Acids: ప్రోటీన్లు, మాంసకృతులు, అమైనో ఆమ్లాలు శరీరానికి సమపాళ్లలో అందుతాయి.


Healthy muscles: కండరాలు క్షీణించకుండా ఆరోగ్యంగా పనిచేస్తాయి.


Over weight: అధిక బరువు ఉన్నవారు తప్ప మిగితావారు పచ్చసొనను కూడా తినవచ్చు. Also read: Bad Breath: నోటి దుర్వాసనను తేలికగా తీసుకోకండి


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR