Health Tips | వేసవి కాలం వచ్చిందంటే పండ్లు అధికంగా తీసుకుంటాం. ముఖ్యంగా విటమిన్ సి (vitamin c in orange) ఎక్కువగా లభించే నారింజ పండ్లు (Orange Fruits)ను బాగా తింటాం. ఆరెంజ్ తింటే కేవలం విటమిన్ ‘సి’తో పాటు ఎన్నో పోషకాలు లభిస్తాయి. నారింజలో యాంటీ ఆక్సిడెంట్ బెటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో తోడ్పడుతుంది.  అయితే చాలా మందికి తెలియని అంశం నారింజలో దాగి ఉన్నాయి. నారింజ తొక్కే కదా అని పండు తిని తొక్కలను తీసి పారేస్తాం. కానీ దాని ప్రయోజనాలు (Health Benefits of Orange Peel) తెలిస్తే తొక్కలను సైతం జాగ్రత్త చేసి వాడుకుంటారని నివేదికలు చెబుతున్నాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


నారింజ పండు తొక్క వల్ల ప్రయోజనాలు (Benefits of Orange Peel)


  • నారింజ పండు తొక్కలో క్యాన్సర్ కణాలతో పోరాడే గుణం, శక్తి ఉంటుంది. నారింజ తొక్కలోని పాలీమిథాక్సీఫ్లేవోన్స్ అనే ఫ్లేవనాయిడ్లలో కొన్ని రకాల క్యాన్సర్ కణాలను నిలువరించే గుణం ఉంటుంది. ఈ తొక్కలను ఏదో విధం తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు మీ దరిచేరవు.



  • నారింజ తొక్కను ఎండబెట్టి, తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడిని సున్నిపిండిలో కలుపుకుని స్నానానికి ముందు చర్మానికి రాసుకుంటే చర్మంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోయి చర్మం మృదువుగా కనిపిస్తుంది.


  • నారింజ పండు తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఏదైనా రూపంలో తీసుకుంటే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అజీర్తితో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుంది.




 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe