Best Winter Fruit: ఈ శీతాకాలంలో సీతాఫలం తింటే ఎన్ని లాభాలో తెలుసా
Best Winter Fruit: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో మనిషి శరీరానికి కావల్సిన చాలా రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. సీజనల్ ఫ్రూట్స్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Best Winter Fruit: ప్రకృతిలో కొన్ని రకాల పండ్లు ఏడాది మొత్తం లభిస్తే మరి కొన్ని రకాల పండ్లు ప్రత్యేక సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. పండ్లు తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయనుకుంటే అందులో సీజనల్ ఫ్రూట్స్ మరింత ఎక్కువ లబ్ది చేకూరుస్తాయి. అందుకే సీజనల్ ఫ్రూట్ ఎప్పుడూ వదలకూడదంటారు.
మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏ సీజన్‌లో లభించే పండ్లను ఆ సీజన్‌లో తప్పకుండా తీసుకోవాలి. ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. శీతాకాలం అనగానే వెంటనే గుర్తొచ్చే అద్భుమైన నోరూరించే ఫ్రూట్ సీతాఫలం. ఇది రుచిలో ఎంత తీపిగా ఉంటుందో ఆరోగ్యపరంగా అంత మంచిది. శరీరానికి చాలా చలవ చేసే ఫ్రూట్ ఇది. ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ బి డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. శీతాకాలంలో సీతాఫలం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా చలికాలంలో ప్రధానంగా ఎదురయ్యే ఆస్తమా సమస్య నుంచి సీతాఫలం తక్షణ ఉపశమనం కల్గిస్తుంది. సీతాఫలం ఎక్కువగా తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆస్తమాను తగ్గిస్తాయి. ఎందుకంటే ఆస్తమా అనేది సాధారణంగా ఇన్‌ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇక ఇటీవలి కాలంలో చాలామంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. సీతాఫలం క్రమం తప్పకుండా తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్, ఫోలేట్, విటమిన్ సి కారణంగా ఎనీమియా సమస్య తొలగిపోతుంది.
రక్తపోటు సమస్యతో బాధపడేవారికి సీతాఫలం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలు రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉంటుంది. అదే సమయంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. సీతాఫలం క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి3 కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. తద్వారా గుండె వ్యాధులు తగ్గుతాయి.
సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కారెనోయిక్ యాసిడ్, విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్, కెటోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల కారణంగా కేన్సర్, గుండె వ్యాధులు తగ్గుతాయి. బక్కపల్చగా, బలహీనంగా ఉండేవారికి సీతాఫలం చాలా మంచిది. బరువు పెరిగేందుతు దోహదం చేస్తుంది. హెల్తీ వెయిట్‌కు ఉపయోగపడుతుంది. ఇక సీతాఫలంతో మరో ఉపయోగం జీర్ణక్రియను మెరుగుపర్చడం. ఇందులో పైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, అతిసార, అజీర్తి వంటి సమస్యలు దూరమౌతాయి. శరీరానికి ఎనర్జీ లభిస్తుంది.
Also read: Fat Burning Drinks: రూపాయి ఖర్చు లేకుండా మీ ఒంట్లో కొవ్వు 15 రోజుల్లో కరగడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook