Health Benifits of Beetroot: ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బీట్‌రూట్ ప్రస్తావన తప్పదు. కొందరు బీట్‌రూట్‌ను సలాడ్‌గా ఉపయోగిస్తే, మరికొందరు బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడతారు. చాలామంది తమ డైట్‌లో బీట్‌రూట్‌ను తీసుకుంటారు. బీట్‌రూట్ కూలింగ్ ఎఫెక్ట్‌ని కలిగి ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్ చక్కని ఔషధం. మీరు కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే.. మీరు మీ ఆహారంలో బీట్‌రూట్‌ను చేర్చుకోవచ్చు. బీట్‌రూట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తహీనతకు చెక్ :


బీట్‌రూట్ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. సాధారణంగా చాలామంది దీన్ని సలాడ్ రూపంలో తీసుకుంటారు. రోజుకు ఒకటి నుండి రెండు బీట్‌రూట్స్ తీసుకుంటే రక్తహీనత సమస్య తలెత్తదు. అంతేకాదు, ఇది మీ చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.బీట్‌రూట్ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. గుండెకు చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది


బరువు తగ్గేందుకు :


బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి బీట్‌రూట్ బెస్ట్ ఫుడ్. రోజూ ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గుతారు. హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు.


లైంగిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది :


పురుషులు లైంగిక ఆరోగ్యం కోసం బీట్‌రూట్‌ను తీసుకోవచ్చు. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ జననాంగాల్లో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఇది కాకుండా, బీట్‌రూట్‌లో బోరాన్ అనే రసాయనం ఉంటుంది. ఇది లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


Also Read: Vijayasai Reddy: చిదంబరం ఒక ఆర్థిక ఉగ్రవాది.. తక్షణమే అరెస్ట్ చేయాలి... వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి


Also Read: Best Zodiac Signs To Marry: ఈ రాశుల వారిని జీవిత భాగస్వామిగా పొందితే... అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook