Vijayasai Reddy: చిదంబరం ఒక ఆర్థిక ఉగ్రవాది.. తక్షణమే అరెస్ట్ చేయాలి... వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy on Chidambaram:  కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంపై విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 10:56 PM IST
  • చిదంబరంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి
  • వరుస ట్వీట్లతో చిదంబరంపై ఘాటు వ్యాఖ్యలు
  • చిదంబరంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
Vijayasai Reddy: చిదంబరం ఒక ఆర్థిక ఉగ్రవాది.. తక్షణమే అరెస్ట్ చేయాలి... వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy on Chidambaram: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడైన ఎంపీ కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ మంగళవారం (మే 17) సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. చైనీయులకు వీసాలు ఇప్పించేందుకు భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకున్నారనే అభియోగాలపై సీబీఐ కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. ఈ పరిణామాలపై ట్విట్టర్‌లో స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో చిదంబరంపై విరుచుకుపడ్డారు.

చిదంబరం ఒక ఆర్థిక ఉగ్రవాది అని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు నైతిక విలువలు లేవన్నారు. లా కాలేజీల్లో చిదంబరంను ఒక కేస్ స్టడీగా పెట్టుకోవచ్చన్నారు. మనీ లాండరింగ్ మొదలు ముడుపులు తీసుకుని చైనీయులకు వీసాలు ఇప్పించిన కేసు వరకు చిదంబరం చేయని నేరం లేదన్నారు. కేంద్రమంత్రిగా చిదంబరం తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

చిదంబరం చేసిన తప్పులన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చిదంబరంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 2004-2014 కాలంలో కేంద్రమంత్రిగా చిదంబరం తీసుకున్న అన్ని నిర్ణయాలు, చర్యలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. ప్రత్యర్థులపై కనికరం లేకుండా కేసులు బనాయించిన చిదంబరం ఇప్పుడు అంతకంతకు అనుభవిస్తున్నాడని విమర్శించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా చిదంబరం కోట్ల రూపాయల డబ్బును కూడబెట్టారనడానికి తెరపైకి వస్తున్న కేసులే సాక్ష్యమని అన్నారు. 

ఓవైపు ఇలా వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతూ మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, రాజకీయ అంశాల గురించి చిదంబరం ఎలా మాట్లాడుతున్నాడో తనకైతే అర్థం కావట్లేదన్నారు. చిదంబరం దేశానికే శత్రువు అని... కేంద్రమంత్రిగా ఆయన అక్రమాలు, నేరపూరిత వ్యవహారాలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించాయని అన్నారు. ధనవంతుల కోసం పేదలపై భారం మోపాడని... ఆ సమయంలో కుంభకోణాలకు పాల్పడిన ప్రతీ ఒక్కరితో చిదంబరం లాలూచీ పడ్డారని ఆరోపించారు. చిదంబరంపై విజయసాయి ట్వీట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. 

Also Read: Blood Letter To Modi: ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ... ఎవరు, ఎందుకు రాశారంటే...

Also Read: Best Zodiac Signs To Marry: ఈ రాశుల వారిని జీవిత భాగస్వామిగా పొందితే... అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News