Walnuts Benefits: సరైన పోషక పదార్ధాలుండే ఆహార పదార్ధాలు తీసుకుంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే డ్రైఫ్రూట్స్ ఇందుకు దోహదపడతాయి. డ్రైఫ్రూట్స్ అనగానే అద్భుత ఔషధాలు కలిగిన వాల్‌నట్స్ లేదా అఖ్రోట్ గుర్తుకు రావల్సిందే. డ్రైఫ్రూట్స్ ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరానికి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా అవసరం. నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ కీలకంగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. ఇందులో ప్రముఖమైనవి వాల్‌నట్స్. రోజూ వాల్‌నట్స్ తీసుకంటే మెదడు షార్ప్‌గా ఉండటమే కాకుండా..ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపర్చడం, ఇమ్యూనిటీ పెంచడం వంటివి వాల్‌నట్స్ ఉపయోగాల్లో ముఖ్యమైనవి. రోజూ పరగడుపున తింటే ఎక్కువ లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


జీర్ణక్రియ


వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా..మలబద్ధకం సమస్య సాధారణమైపోయింది. ఈ పరిస్థితుల్లో రోజూ ఉదయం పూట..పరగడుపున వాల్‌నట్స్ తీసుకుంటే చాలా ప్రయోజనముంటుంది. దీనివల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగైందో..మలబద్ధకం సమస్య పోతుంది. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


రోగ నిరోధక శక్తి


అన్నింటికంటే ముఖ్యమైనది రోగ నిరోధక శక్తి. ఇది పెరగాలంటే ప్రతిరోజూ తప్పకుండా వాల్‌నట్స్ తీసుకోవాలి. రోజూ పరగడుపున తీసుకుంటే కచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగడమే కాకుండా..రోగాల్ని ఎదుర్కొనే సామర్ధ్యం పెరుగుతుంది. 


నిత్యం పోటీ ప్రపంచం కారణంగా ఒత్తిడి, ఆందోళన, వివిధ కారణాలతో వివిధ రకాల ఆలోచనలతో నిద్రకు దూరమౌతుంటాం. ఫలితంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రతిరోజూ వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల నిద్రకూడ సుఖంగా పడుతుంది. అటు ఒత్తిడి, ఆందోళనను జయించవచ్చు.  


Also read: Diabetes: రోజూ ఈ డ్రింక్స్ తీసుకుంటే..మధుమేహం చిటికెలో మటుమాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook