Health Care: సాధారణంగా చాలామంది మలబద్ధకం సమస్యను తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది ఇతర అనారోగ్య పరిస్థితులకు కారణమౌతుంది. పరిస్థితి తీవ్రమైతే ప్రమాదకరం కావచ్చు కూడా. అందుకే సకాలంలో ఈ సమస్యకు చికిత్స ఉండేట్టు చూసుకోవాలి. మలబద్ధకం సమస్య నుంంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో సంభవించే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం చాలావరకూ చుట్టూ ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, పదార్ధాల్లోనే ఉంటుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది తమలపాకుల గురించి. తమలపాకులతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆధునిక జీవన విధానంలో చాలామంది ఎదుర్కొనే మలబద్ధకం సమస్యతో సహా వివిధ రకాల సమస్యల్నించి తమలపాకులు కాపాడుతాయి.


కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు, తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బందిపడేవాళ్లు, మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు తమలపాకుల్ని నిర్ణీత పద్ధతిలో తింటే కచ్చితంగా ఈ సమస్యలు దూరమౌతాయి. లేత తమలపాకుల్ని రోజూ 1-2 నమిలి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ బాగుంటుంందో..మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ఆధునిక జీవన విధానంలో మలబద్ధకం సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. దీనికి కారణం జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడమే. వీటి వల్ల జీర్ణక్రియలో సమస్య ఏర్పడి అది కాస్తా మలబద్ధకానికి దాారితీస్తుంది. 


ఇక చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడేవారికి తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. తమలపాకుల్ని సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా భావిస్తారు. నోటి దుర్వాసనతో బాధపడుతుంటే తమలపాకులతో ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు మీ నోటి దుర్వాసనను పోగొడతాయి. అంతేకాదు..పుచ్చు పళ్లు, చిగుళ్ల సమస్యకు కూడా మంచి పరిష్కారం.


ఇక అత్యంత ప్రమాదకరమైన మధుమేహం సమస్యకు కూడా తమలపాకులే పరిష్కారం. తమలపాకులు నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. తమలపాకులతో కషాయం చేసుకుని కూడా తాగవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.


Also read: Apple Cider Vinegar: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ క్షణాల్లో మాయం, స్థూలకాయానికి చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook