Apple Cider Vinegar: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ క్షణాల్లో మాయం, స్థూలకాయానికి చెక్

Apple Cider Vinegar: ఆధునిక జీవ విధానంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2023, 05:55 PM IST
Apple Cider Vinegar: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ క్షణాల్లో మాయం, స్థూలకాయానికి చెక్

Apple Cider Vinegar: చాలామందికి కడుపు, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయుంటుంది. ఇంకొంతమందికి స్థూలకాయం బాధిస్తుంటుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు అద్భుతమైన చిట్కా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ఈ సమస్యకు చాలా సులభంగా చెక్ చెప్పవచ్చంటున్నారు.

మనిషి ఆరోగ్యపరంగా ఎదుర్కొనే ప్రతి సమస్యకు చాలావరకూ ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే సమాధానం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలైనా లేదా అధిక బరువు లేదా స్థూలకాయం సమస్యలైనా సరే సరైన పద్ధతులు అనుసరిస్తే చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. రోజూ ఉదయం వేళ ఒక గ్లాసు నీళ్లలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే బెల్లీ ఫ్యాట్ అద్భుతంగా కరిగిపోతుంది. ఎంత తాగాలి, ఎలా తాగాలనేది తెలుసుకుందాం. ఒక గ్లాసు నీళ్లలో 2 చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే  బెల్లీ ఫ్యాట్ అద్భుతంగా తగ్గుతుంది. దాంతోపాటు మద్యం, అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అంతేకాకుండా రోజుకు 7-8 గంటలు నిద్ర తప్పకుండా ఉండాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో తోడ్పడుతుంది. ఫలితంగా శరిరంపై అదనపు కొవ్వు చేరదు. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ గ్లూకోగోన్‌గా మారే ప్రక్రియను మందగింపచేస్తుంది. ఫలితంగ కొవ్వు కరుగుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది శరీరం మెటబోలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలోని కొవ్వుని ఎనర్జీగా మార్చేది మెటబోలిజం మాత్రమే. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆకలిని సైతం నియంత్రించగలదు. దాంతో అధిక బరువు సమస్యకు చెక్ చెప్పవచ్చు.

Also read: Spinach: పాలకూర అతిగా తింటే ప్రమాదకరమా, కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News