Morning Headache: ఉదయం లేవగానే కొంతమందికి తీవ్రమైన తలపోటు బాధిస్తుంటుంది. తెలిసో తెలియకో..తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఉదయం వేళల్లో ఇలా జరిగితే అది దేనికి సంకేతం..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక వ్యాధులు కూడా సామాన్యమైన లక్షణాలతో అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ మనం ఒక్కోసారి నిర్లక్ష్యం చేయడమో లేదా తేలిగ్గా తీసుకోవడమో చేస్తుంటాం. కానీ ఆ లక్షణాల వెనుక బలమైన కారణం ఉంటుంది. అందులో ఒకటి ఉదయం వేళ లేవగానే తీవ్రమైన తలనొప్పి సమస్య. ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకుందాం..


ఒకవేళ మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఉదయం లేవగానే తలనొప్పి సమస్య వస్తుంది. తలనొప్పితో పాటు బలహీనంగా ఉండి మైకం కమ్మితే ఆక్సిజన్ లోపం కావచ్చు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే మార్నింగ్ సిక్నెస్ సమస్య ఉంటుంది. రోజూ ఉదయం లేవగానే తలపోటుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో షుగర్ టెస్ట్ చేయించడం మంచిది. రోజూ నీళ్లు తక్కువ తాగుతున్నా సరే..ఉదయం లేవగానే తలనొప్పి సమస్య వచ్చే అవకాశాలున్నాయి. అందుకే క్రమం తప్పకుండా ఎక్కువ నీళ్లు తాగుతుండాలి.


స్లీప్ డిజార్డర్ కారణంగా కొంతమందికి రోజూ ఉదయం లేవగానే తలపోటు బాధిస్తుంది. చాలామందికి ఒత్తిడి కారణంగా కూడా తలపోటు సమస్య వస్తుంటుంది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారికి ఉదయం లేవగానే తలపోటు ఉంటుంది. ఉదయం లేవగానే తలపోటుగా ఉంటే..నిమ్మరసం తాగాలి. కూల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్‌లో నిమ్మరసం పిండుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.


Also read: Health Precautions: మీకు మధుమేహం ఉందా..అయితే తప్పకుండా ఫాలో కావల్సిన 5 సూచనలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి