Immunity Boosters: ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే చాలు..ఈ చలికాలం సురక్షితమే
Immunity Boosters: చలికాలం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. చలికాలం ప్రారంభమవుతూనే అంటురోగాల భయం వెంటాడుతుంది. చలికాలం సమస్యల్నించి రక్షించుకునేందుకు కొన్ని రకాల పండ్లను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
చలికాలం ప్రారంభం కావడంతో దేశం మొత్తం చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు చలిగాలులతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చలికాలం సమస్యలకు కొన్ని రకా పండ్లతో చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు
చలికాలంలో సహజంగానే రకరకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ఎందుకంటే చలికాలంలో మనిషి రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు త్వరగా సోకుతుంటాయి. అందుకే చలికాలంలో ఈ పండ్లను డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరోవైపు డెంగ్యూ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.
స్టార్ ఫ్రూట్ ప్రయోజనాలు
స్టార్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫలితంగా అంటురోగాల ముప్పు తగ్గుతుంది. ఇందులో కేలరీలు తక్కువ కావడంతో అధిక బరువు సమస్య నుంచి కూడా రక్షించుకోవచ్చు. స్టార్ ఫ్రూట్‌ను యాంటీ ఏజీయింగ్‌గా ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు.
కివీ, స్ట్రాబెర్రీ
కివీ, స్ట్రా బెర్రీ రెండింటిలోనూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా సమయంలో కివీ పండ్ల ప్రాధాన్యత బాగా పెరిగింది. కివీలో దాదాపు 85 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇక స్ట్రా బెర్రీలో 100 గ్రాముల విటమిన్ సి ఉంటుంది.
బొప్పాయి, జాంకాయలు
బొప్పాయి జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. బొప్పాయి, జాంకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒక బొప్పాయి ముక్కలో దాదాపు 88 మిల్లీగ్రాముల పోషక పదార్ధాలు ఉంటాయి. అటు జాంకాయలో 200 మిల్లీగ్రాముల పోషకాలుంటాయి.
Also read: Winter Special Tea: చలికాలం అనారోగ్య సమస్యలు దూరం చేసే అద్భుతమైన మసాలా టీ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook