శరీరంలో జరిగే ప్రతి మార్పు, ప్రతి అసౌకర్యం అనారోగ్యానికి సంకేతమే. కొంతమందికి రాత్రివేళ పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ సమస్య ఉందంటే...తీవ్ర వ్యాధి కావచ్చు. దాని లక్షణమే ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమందికి రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మీకు ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దు. ఎందుకంటే మూత్రం ఎక్కువగా వస్తుందంటే..బ్లేడర్, కిడ్నీ, ఫిల్టరేషన్ ప్రక్రియలో సమస్య ఉన్నట్టే అర్ధం. శరీరంలో ఏదో ఒక భాగంలో సమస్య కారణంగా..పదే పదే మూత్రం వస్తుంటుంది. 


బ్లేడర్ స్టోన్


మీరు హఠాత్తుగా రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుందంటే..మీ బ్లేడర్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లేడర్ లోపల రాళ్లు ఉంటే మూత్రం తరచూ వస్తుంటుంది. మూత్రంలో అడ్డంకి ఏర్పడటం వల్ల ఇలా జరుగుతుంటుంది. 


ప్రోస్టేట్ గ్రంథి పెరగడం


పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ఓ సాధారణ సమస్య. ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే మూత్ర ప్రవాహానికి బ్రేక్ పడుతుంది. దాంతో పదే పదే యూరిన్ వస్తుంటుంది.


డయాబెటిస్


ఎక్కువ సార్లు మూత్రం రావడం డయాబెటిస్ కారణం కావచ్చు. డయాబెటిస్ ఎక్కువగా ఉంటే..రక్తంలో అధిక మోతాదులో గ్లూకోజ్ చేరుతుంది. ఫలితంగా కిడ్నీ ఎక్కువ గ్లూకోజ్ ఫిల్టర్ చేయడం, విసర్జించేందుకు ఎక్కువసేపు పనిచేస్తుంది.


కిడ్నీ వ్యాధులు


కిడ్నీ వ్యాధుల్లో సాధారణంగా మూత్రం ప్రభావితమౌతుంది. కిడ్నీలో రాళ్లు, క్రానిక్ కిడ్నీ డిసార్డర్, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యల కారణంగా పదే పదే మూత్రం వస్తుంటుంది.


యూటీఐ ఇన్‌ఫెక్షన్


యూటీఐ ఇన్‌ఫెక్షన్ కారణంగా పదే పదే మూత్రం వస్తుంది. మూత్రాశయం, మూత్రమార్గంలో ఎక్కడ సమస్య ఉన్నా ఇలా అవుతుంది. మరోవైపు మూత్రం పోసేటప్పుడు నొప్పి కలుగుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. 


Also read: Mens Health Care Tips: ఈ అలవాట్లు మానుకోకపోతే..స్పెర్మ్‌కౌంట్ పడిపోతుంది జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook